ప్రభాస్ గురించి ఒక్కో అప్ డేట్ వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు కెరీర్ 19వ సినిమా `సాహో` చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో ల్యాండ్ మార్క్ 20వ సినిమాని రీసెంట్ గానే ప్రారంభించాడు. ఈ సినిమా పూర్తి ప్రేమకథా చిత్రం. 1960 బ్యాక్ డ్రాప్ తో థ్రిల్ చేస్తుందిట. అందుకు తగ్గట్టే ఇటలీ - యూరప్ లోని ఎగ్జోటిక్ లొకేషన్లలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ముంబై భామ పూజా హెగ్డేతో డార్లింగ్ రొమాన్స్ చేయనున్నాడు.
డార్లింగ్ ఎట్టిపరిస్థితిలో మరో బంపర్ హిట్ కొట్టడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నాడు. `సాహో` లాంటి భారీ చిత్రం తర్వాత ఈ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది కాబట్టి ఆడియెన్ తన నుంచి హై ఎండ్ మూవీనే ఊహిస్తారు. అందుకు తగ్గట్టే టెక్నికల్ టీమ్ ని ప్రభాస్ & టీమ్ సెట్ చేసుకున్నారట. జాతీయ అవార్డు గ్రహీత.. సైరా సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అదే స్థాయి టాప్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ను - ఏమాయ చేశావే ఫేం మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీని.. అందించనున్నారని తెలుస్తోంది.
ఓవైపు సాహో నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. ఆ క్రమంలోనే ఈ నెల 20 నుంచి ప్రభాస్ 20 రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇటలీలో రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెట్టి భారీ షెడ్యూల్ ని తెరకెక్కిస్తారట. గోపి కృష్ణ మూవీస్- యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బడ్జెట్ పరంగా రాజీ లేకుండా నిర్మిస్తున్నామని నిర్మాతలు ఇదివరకూ ప్రకటించారు.