ఏమిటీ వైపరిత్యం శ్రీనివాసా ?

Update: 2018-08-10 12:30 GMT
అనుకున్నట్టే శ్రీనివాస కళ్యాణం ఈ మధ్య టాలీవుడ్ కు బొత్తిగా కలిసి రాని నెగటివ్ పెళ్లి సెంటిమెంట్ బాటలోనే వెళ్తోంది. మొదటి షో నుంచే యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాకపోవడం ఒక ఎత్తైతే దిల్ రాజు సినిమాలు మెల్లగా పుంజుకుంటాయి అనే వాదనకు వ్యతిరేకంగా అంతకంతా సోషల్ మీడియాలో సైతం విమర్శలు రావడం ఖంగారు కలిగించే విషయమే. నిజానికి దిల్ రాజు మాత్రమే కాదు నితిన్ అభిమానులు కూడా దీనికి భారీ ఓపెనింగ్స్ ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. బిసి సెంటర్స్ లో ఇలాంటి ఫామిలీ మూవీస్ కి ఫస్ట్ డే వీక్ గా ఉండటం సహజం కాబట్టి వాటిని పక్కన పెట్టినా కీలకమైన వైజాగ్-విజయవాడ లాంటి చోట్ల కూడా ఉదయం ఆటకు కొన్ని థియేటర్స్ లో ఫుల్ రికార్డ్ కాలేదని ట్రేడ్ టాక్. ఓ సినిమా హాల్ లో 320 కెపాసిటీ ఉంటే కేవలం 70 టికెట్లు మాత్రమే తెగాయి అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గురువారం కాబట్టి అలా వచ్చి ఉండొచ్చు అని అనుకోవడనికి లేదు. బాగుంది అంటే మధ్యాహ్నం  నుంచే వసూళ్లు అనూహ్యంగా పెరగడం హిట్ అయిన సినిమాల విషయంలో చూస్తూనే ఉన్నాం. దానికి మహానటి మంచి ఉదాహరణ. బుధవారం రిలీజ్ అయినా బ్రహ్మరధం దక్కింది.

దీనికి కారణం చాలా స్పష్టం. దర్శకుడు సతీష్ వేగ్నేశ నుంచి ప్రేక్షకులు ఇది ఆశించలేదు. మంచి ఫామిలీ డ్రామాతో గుండె తడి చేసే సెంటిమెంట్ ని కోరుకున్నారు. కానీ దానికి భిన్నంగా పెళ్లి గురించి క్లాసులు ఇప్పించడం అంతగా రుచించడం లేదని పబ్లిక్ టాక్ ని బట్టి అర్థమవుతోంది. ఇది ఒకరకంగా చెప్పాలంటే షాకింగ్ ఓపెనింగ్స్. నితిన్  గత సినిమాలు లై-చల్ మోహన రంగా దీని కంటే బెటర్ గా రాబట్టాయనే  టాక్ కూడా ఉంది. ఈ మూడు రోజులు ఏదోలా మేనేజ్ చేసినా సోమవారం నుంచి అసలు పరీక్ష ఉంది. తక్కువ గ్యాప్ లో గీత గోవిందం వస్తోంది. విజయ్ దేవరకొండ హీరో కావడంతో పాటు యూత్ టార్గెట్ చేసిన లవ్ మూవీ కనక  శ్రీనివాసుడికి చాలా చోట్ల సెలవు తప్పదని అంటున్నారు. కానీ వెనుక ఉంది దిల్ రాజు కాబట్టి కొంత లాగినా ఫైనల్ గా ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటే వసూళ్లు అలా వస్తాయి. మరో రెండు రోజుల్లో శ్రీనివాసుడు కోలుకుంటాడా లేక బై చెప్పేస్తాడా చూడాలి.
Tags:    

Similar News