ట్రెండీ స్టోరి: టాప్ -20 సినీతార‌ల బ్రేక‌ప్స్

Update: 2021-07-04 07:33 GMT
సెల‌బ్రిటీ విడాకులు అన్నివేళ‌లా హాట్ టాపిక్. ఏళ్ల త‌ర‌బ‌డి సంసార జీవ‌నం సాగించాక విడిపోయిన జంట‌లు కొంద‌రైతే.. వివాహానంత‌రం త‌క్కువ వ్య‌వ‌ధిలోనే విడిపోయిన జంట‌లు ఉన్నారు. మహేష్ బాబు- నమ్రత‌లా..  సూర్య‌- జ్యోతిక లా అన్యోన్య దాంప‌త్యం అన్నివేళ‌లా చూడ‌లేని ప‌రిస్థితి ఉంది. నేటి అధునాత‌న జీవ‌న‌ ప్ర‌పంచంలో ఏ జంట ఎప్పుడు విడిపోతుందో ఊహించ‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇటీవ‌ల చాలాకాలంగా హాలీవుడ్ లో బ్రాడ్ ఫిట్ - ఏంజెలినా జోలీ విడాకుల వ్య‌వ‌హారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మార‌గా.. నిన్న‌టికి నిన్న మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ - కిర‌ణ్ రావు జంట విడాకులు తీసుకుంటున్నామంటూ ప్ర‌క‌టించ‌డం భార‌తీయ చ‌ల‌న‌చిత్ర‌సీమ‌ల్లో సంచ‌ల‌నంగా మారింది. 15 ఏళ్ల కాపురం త‌ర్వాత అమీర్ - కిర‌ణ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే తెలుగు చ‌ల‌న‌చిత్ర సీమ స‌హా ఇరుగు పొరుగు భాష‌ల్లో ఇలా విడాకులు తీసుకున్న జంట‌ల వివ‌రాల్ని సేక‌రిస్తే తెలిసిన సంగ‌తులివి..

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నాగార్జున -ల‌క్ష్మి దగ్గుబాటి (1984-1990) విడాకులు అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యింది. నాగార్జున 1984 లో డాక్టర్ డి రామానాయుడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారి సంబంధం చాలా కఠినమైన ఫేజ్ లో ప్ర‌వేశించింది. విభేధాలు త‌లెత్త‌డంతో 1990 లో విడాకులు తీసుకున్నారు. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తొలుత వాణి గ‌ణ‌ప‌తిని వివాహ‌మాడారు. కానీ ఆ జంట విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత సారిక‌ను క‌మ‌ల్ హాస‌న్ ప్రేమించి పెళ్లాడారు. ఈ జంట‌కు శ్రుతిహాస‌న్ - అక్ష‌ర హాస‌న్ వార‌సులు. న‌టి గౌత‌మితో క‌మ‌ల్ స‌హ‌జీవ‌నం తెలిసిందే. ఇటీవ‌లే విభేధాల‌తో గౌత‌మి నుంచి క‌మ‌ల్ విడిపోయారు.

పవన్ కళ్యాణ్ - నందిని (1997-2008) విడాకులు ఇండ‌స్ట్రీలో అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పవన్ కళ్యాణ్ పవన్ కల్యాణ్ మొదటి వివాహం మే 1997 లో జరిగింది. ఇది 1996 లో కెరీర్ ప్రారంభించిన ఏడాదికే.. ఈ జంట ఎలా ఎప్పుడు కలుసుకున్నారనే దాని గురించి పెద్దగా తెలియదు. కానీ ఆ త‌ర్వాత ఈ పెళ్లి బ్రేక‌ప్ అయ్యింది. ఆ త‌ర్వాత బ‌ద్రి క‌థానాయిక రేణు దేశాయ్ ని ప‌వ‌న్ పెళ్లాడారు. పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ (2009-2012) మూడేళ్ల త‌ర్వాత బ్రేక‌ప్ అయ్యారు. 2004 నుంచి ఆ ఇద్ద‌రూ సంబంధంలో ఉన్నారు. 2009 లో వివాహం చేసుకున్నారు. చివరికి 2011 మిడిల్ లో ఈ జంట మ‌ధ్య‌ విభేదాలు పెరిగాయి. వారు విడాకుల కోసం దాఖలు చేయ‌గా 2012 లో మంజూరయ్యాయి.

అందాల క‌థానాయిక‌ త్రిష కృష్ణన్- వరుణ్ మానియన్ నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి ముందే బ్రేక‌ప్ అయ్యింది. వరుణ్ మానియన్ తో తన ఎంగేజ్ మెంట్ ను అనేక కారణాల వల్ల త్రిష‌ విరమించుకున్నారు.

అరవింద్ స్వామి - గాయత్రి రామమూర్తి (1994-2003) బ్రేక‌ప్ ఒక సంచ‌ల‌నం. అరవింద్ స్వామి 1994 లో గాయత్రిని వివాహం చేసుకున్నారు. ఈ జంట‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తరువాత ఈ జంట 2003 లో విడిపోయారు. 2010 లో అరవింద్ స్వామికి అపర్ణ ముఖర్జీతో సంబంధం ఉందని తేల‌గా.. 2012 లో ఆమెను వివాహం చేసుకున్నారు.

మంచు మ‌నోజ్-ప్ర‌ణ‌తి రెడ్డి బ్రేక‌ప్ విడాకులు అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. ప్ర‌ణ‌తీరెడ్డిని పెద్ద‌ల అంగీక‌రింతో ప్రేమ వివాహం చేసుకున్నారు హీరో మంచు మ‌నోజ్. 2015 మే 20న వీరి వివాహం జ‌రిగింది. ఆ త‌రువాత నుంచి కెరీర్ ప‌రంగా వ‌రుస ఫ్లాప్ లు ఎదురై మాన‌సికంగా డిస్ట్ర‌బ్ కావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు పెరిగాయ‌న్న ప్ర‌చారం సాగింది. ఇటీవ‌లే ఈ జంట విడాకులు తీసుకున్నారు.

అఖిల్ అక్కినేని -శ్రీయ భూపాల్ బ్రేక‌ప్ యువ‌త‌రంలో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అఖిల్ అక్కినేని-శ్రీయ భూపాల్ జంట‌ రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత నిశ్చితార్థం జరిగింది. ర‌క‌ర‌కాల‌ కారణాల వల్ల ఈ జంట పెళ్లి ర‌ద్ద‌య్యింది. తరువాత శ్రీయా భూపాల్ జూలై 2018 లో వివాహం చేసుకున్నారు. అఖిల్ కెరీర్ పై దృష్టి సారించారు.

చాలా కాలం పాటు సినిమాలు త‌గ్గించుకుంటూ వ‌చ్చిన శృతిహాస‌న్ లండ‌న్ కు చెందిన మైఖేల్ కోర్స‌లేతో డేటింగ్ చేసింది. ఇద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమలో మునిగితేలారు కూడా. ఎక్క‌డికి వెళ్లినా.. ఏ ఫంక్ష‌న్ కు వెళ్లినా మైఖేల్ ని కూడా తీసుకువెళ్లి హంగామా చేసింది శృతి. ఆ మ‌ధ్య చెన్నైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి క‌మ‌ల్ హాస‌న్ తో క‌లిసి మేఖేల్ సంప్ర‌దాయ త‌మిళ లుంగీ క‌ట్టులో క‌నిపించ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. త్వ‌ర‌లో శృతి- మైఖేల్ వివాహం చేసుకోబోతున్నార‌ని వార్త‌లు షికారు చేశాయి. అయితే అనూహ్యంగా ఇద్ద‌రు బ్రేక‌ప్ చెప్పుకున్నారు. శ్రుతి ఇటీవ‌ల డూడుల్ ఆర్టిస్ట్ శంత‌నుతో ప్రేమ‌లో ఉన్నారు.

సౌందర్య రజనీకాంత్- అశ్విన్ రామ్‌కుమార్ (2010-2017) జంట విడాకులు త‌మిళనాడు స‌హా ర‌జ‌నీ అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్  2010 లో పారిశ్రామికవేత్త అశ్విన్ రామ్ కుమార్ ని పెళ్లాడారు. ఏడు సంవత్సరాల సంసార జీవ‌నం అనంత‌రం ఈ జంట 2017లో విడిపోయారు.

నయనతార - ప్రభుదేవ జంట  బ్రేక‌ప్ గురించి తెలిసిన‌దే. 2010 లో తన భార్య రామలతతో విడాకులు తీసుకున్న ప్ర‌భుదేవా చాలాకాలం పాటు న‌య‌న‌తార‌తో స‌హ‌జీవ‌నంలో ఉన్నారు. కానీ అనూహ్యంగా ఆ బంధానికి కూడా బ్రేక్ ప‌డింది. ప్ర‌స్తుతం న‌య‌న‌తార ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ తో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

అమలా పాల్ -ఎ. ఎల్. విజయ్ (2014-2017) జంట విడాకులు అప్ప‌ట్లో హాట్ టాపిక్. అమలా పాల్ టాలెంటెడ్ నాయిక‌గా ప‌రిశ్ర‌మ‌లో వెలిగిపోతున్న స‌మ‌యంలో దర్శకుడు విజయ్ తో సెట్స్ లో ప్రేమలో పడ్డారు. తరువాత 2014 లో పెళ్లితో ఒక‌ట‌య్యారు. తరువాత అనేక వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట 2017 లో విడిపోయారు. ఆ ఇరువురి న‌డుమా ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌లు మీడియా హెడ్ లైన్స్ లోకి వ‌చ్చాయి.

గోవా బ్యూటీ ఇలియానా కూడా ఈ రేసులో చేరింది. తెలుగులో సినిమాలు త‌గ్గ‌డంతో బాలీవుడ్ కు చెక్కేసిన ఈ గోవా బ్యూటీ ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నిబోన్ తో ప్రేమ‌లో ప‌డింది. గ‌త కొంత కాలంగా డేటింగ్ కూడా న‌డిచింది. ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాలో ఫొటోల్ని షేర్ చేయ‌డంతో ఇద్ద‌రు ర‌హ‌స్య వివాహం చేసుకున్నార‌ని ప్ర‌చారం జరిగింది. విభేధాలు త‌లెత్తాయేమో కానీ హ‌ఠాత్తుగా బ్రేక‌ప్ అంటూ విడిపోయారు.

టాలీవుడ్ లో `కొత్త బంగారు లోకం` సినిమాతో హాట్ టాపిక్ అయింది శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌. అయితే ఆ క్రేజ్ ని ఏమాత్రం నిలుపుకోలేక‌పోయింది. చివ‌రికి వ్య‌భిచారం కేసు త‌న‌ని అన్నిర‌కాలుగా చిక్కుల్లో ప‌డేసింది. అయినా... అక్క‌డ త‌న స్నేహితుడు.. ప్రియుడు రోహిత్ మిట్ట‌ల్ ని పెళ్లాడింది. ఏడాది తిర‌క్కుండానే వీరిద్ద‌రు విడాకుల‌కు అప్లై చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

రష్మిక మందన‌-ర‌క్షిత్ శెట్టి జంట బ్రేక‌ప్ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే అయ్యింది. కిరిక్ పార్టీ చిత్రం సెట్స్ లో రష్మిక మందన్న- రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. తరువాత వారు 2017 లో నిశ్చితార్థం చేసుకున్నారు. కెరీర్ ప‌రమైన‌ సమస్యల కారణంగా ఇద్దరూ త్వరలోనే తమ నిశ్చితార్థాన్ని ర‌ద్దు చేసుకున్నారు.

బాలీవుడ్ లో ఇలాంటి విడాకుల కేసులు ఎన్నో. నవాజుద్దీన్ సిద్దిఖీ -ఆలియా విడాకుల వార్తలు అప్ప‌ట్లో సంచ‌ల‌నమ‌య్యాయి. 11 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ జంట విడాకులు తీసుకున్నారు. అర్జున్ రాంపాల్- మెహర్ జెస్సియా జంట విడాకులు తీసుకున్నారు. అనంత‌రం రాంపాల్ విదేశీ యువ‌తితో బంధంలో ఉన్నారు. అర్జున్ ఇప్పుడు మోడల్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ తో ఉన్నారు. ఈ జంట 2019 జూలైలో తమ కొడుకు పుట్టినందుకు స్వాగతం పలికారు. మ‌లైకా అరోరా ఖాన్ నుంచి ఆర్భాజ్ ఖాన్ విడిపోగా ఆ ఇద్ద‌రూ వేర్వేరు గా సెటిలయ్యారు. మ‌లైకా యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో డేటింగ్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ సుశానే నుంచి విడిపోయారు. అయినా మాజీ భార్య సుస్సాన్ ఖాన్ తో సంబంధం కలిగి ఉన్నాడు. కరిష్మా కపూర్-సుంజయ్ కపూర్ విడాకులు అప్ప‌ట్లో ఒక సంచ‌ల‌నం అయిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News