జ్యోతిలక్ష్మితో పెళ్లికి నాయకి ఓకే

Update: 2015-11-03 03:56 GMT
నిన్ను పెళ్లి చేసుకునా అని అడిగింది జ్యోతిలక్ష్మి లాంటి ఛార్మి. నేనెప్పుడూ రెడీయే అంటోంది నాయకి త్రిష. ఈ టాపిక్ ఎందుకొచ్చిందంటే.. దీనికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఓ జ్యూవెలరీ మాల్ కి పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతూ హాజరైంది బ్యూటీ త్రిష. ఆ ఫోటోలను తన ట్విట్టర్ లో పెట్టేసింది.

ఈ ఫోటోని చూసిన నికిషాపటేల్.. అదేనండీ పవన్ కొమరంపులి హీరోయిన్.. పింక్ లో నువ్వు సూపర్బ్ అంటూ త్రిషను పొగిడేసింది. పనిలో పనిగా ఛార్మిని కూడా ట్యాగ్ చేసింది. ఇంక మన జ్యోతి లక్ష్మి ఊరుకుంటుందా. పెళ్లయ్యాక నువ్వు అచ్చం ఇలాగే ఉంటావు కాబట్టి.. నేను నిన్ను పెళ్లి చేసుకోనా అని అడిగేసింది.

అంతే.. త్రిష నుంచి ఏం ఆన్సర్ వస్తుందా అనే ఉత్కంఠ ట్విట్టర్ జనాలకి. 'నువ్వు అక్కడికే వస్తావను నాకు తెలుసు ఛార్మీ. నా ఆన్సర్ ఎప్పుడూ యస్' అంటూ షాకిచ్చింది త్రిష. వీళ్ల ట్విట్టర్ పెళ్లాట బాగా రంజుగానే ఉంది కానీ.. కొంపదీసి ఇదేమన్నా వాట్సాప్ లో మీ గ్రూప్ అనుకుంటున్నారా.. ట్విట్టర్ మర్చిపోయారేమో అంటూ.. ట్విట్టర్ జనాలు కౌంటర్ వేశారు.
Tags:    

Similar News