నువు లేనిదే నేను లేను. నీ కనుచూపు ప్రసరించనిదే నేనేమైపోయేదానినో.. ఇలాంటి మాటలు ఎవరి నోటి నుంచి వస్తాయి? ఒక ప్రియురాలు - ప్రేమికుడి గురించో - ఒక ప్రియుడు ప్రేయసి గురించో ఇలా అన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఓ హీరోయిన్ తన హీరో గురించి మాట్లాడుతూ ఇలా అనేసింది. అయితేనేం అసలు అలా అనడం వెనక అసలు కారణం వేరే ఉందిలే. ఈ ఎపిసోడ్ లో హీరోయిన్ త్రిష. హీరో కమల్ హాసన్.
ఈజోడీ కలిసి నటించిన చీకటిరాజ్యం (తూంగవనం) టీజర్ ఇటీవలే రిలీజై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసాఫీసర్ల గన్ ఫైట్ - స్టయిలిష్ గేమ్ ట్రైలర్ లో ఆకట్టుకుంది. మైండ్ బ్లోవింగ్ అనిపించేలా ఉందా టీజర్ . అందులో కమల్ హాసన్ స్టయిలిష్ గా కనిపించారు. అతడిని మించి త్రిష అంతే స్టయిలిష్ లుక్ లో కనిపించింది. ఘిబ్రాన్ సంగీతం ప్రధాన అస్సెట్. అలానే గౌతమి కాస్ట్యూమ్స్ తో మ్యాజిక్ చేసిందంటే అతిశయోక్తి లేదు. ఇక పోతే కమల్ సార్ నుంచి బోలెడంత సాయం అందింది. ప్రతి పాయింట్ లో ఆయన సాయం చేశారు. చివరికి నాచేత డబ్బింగ్ కూడా చెప్పించారు. మన్మధన్ అంబు తర్వాత మరోసారి సొంతంగా అనువాదం చెప్పుకున్నా.. అంటూ చెప్పుకొచ్చింది త్రిష.
కమల్ సర్ లేనిదే అసలు నేను లేనేలేను.. అని ఫైనల్ గా కంక్లూడ్ చేసింది త్రిష. ఈ చిత్రంతోనే ప్రకాష్ రాజ్ మరోసారి ఎంట్రీ ఇస్తున్నాడు. ఎనీవే .. నాయకి - చీకటి రాజ్యం రెండు సినిమాలతో త్రిష పెద్ద హిట్లు అందుకుంటుందేమో చూడాలి.