దశాబ్ధం పాటు ఎదురేలేని క్వీన్ గా రాజ్యమేలింది త్రిష. ప్రస్తుతం కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఇలాంటి టైమ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో అవకాశం అందుకుంది. మరోవైపు త్రిష నటించిన ప్రయోగాత్మక చిత్రం 96 రిలీజ్ కి వస్తోంది. ఈ చిత్రానికి సి.ప్రేమ్ కుమార్ దర్శకుడు. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించారు.
96 రిలీజ్ ప్రమోషన్స్ టైమ్ లోనే ఓ వీరాభిమానిపై త్రిష వీరంగం ఆసక్తికర చర్చకు తావిచ్చింది. ``నా టైమ్ లైన్ లో ప్రవేశించి అగౌరవం కలిగించే మాటలు మాట్లాడుతావా? వేరొక యాక్టర్ ని తిట్టడాన్ని లాయల్టీగా భావిస్తావా? హరాస్ చేయడం పద్ధతేనా? ఏమనుకుంటున్నావ్.. నిన్ను బ్లాక్ చేసేస్తా!!`` అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది త్రిష.
సామాజిక మాధ్యమాల్లో అభిమానుల మధ్య వార్ గురించి తెలిసిందే. తమ అభిమాన తార మెప్పు కోసం వేరే స్టార్లను కించపరిచేలా - బూతు పదాలతో కామెంట్లు రువ్వడం ఇటీవల ఎక్కువైంది. ఒక్క త్రిష విషయంలోనే కాదు. ఎందరో స్టార్ల విషయంలో అభిమానులు ఇలా చేయడం చర్చకొచ్చింది. వీరాభిమానం వెర్రితలలు వేస్తోంది. పిచ్చి పీక్స్ కి చేరుతోంది. అందుకే తన అభిమానికి ఇలా త్రిష తనదైన స్టైల్లో లెస్సన్ చెప్పింది.