సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వాళ్ల అఫైర్స్ ఎప్పుడూ మీడియాకు హాట్ టాపిక్ గానే ఉంటాయి. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ వివాదాలకు కేంద్ర బిందువు అన్న విషయం తెలిసిందే. అతడి జీవితం ఓ పెద్ద వివాదాల పుట్ట. అందుకే అతడిపై ఓ బయోపిక్ కూడా వచ్చింది. ఓ సినిమాకు కావాల్సిన మసాలా అంతా సంజయ్ జీవితంలో ఉంటుంది. డ్రగ్స్, మాఫియా, గన్స్ ఈ మూడు అతడి జీవితంలో ఓ పార్ట్‌గా మారిపోయాయి. ప్రస్తుతం వాటిని వదిలేసినా.. ఆ జ్ఞాపకాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంటాయి.
ఇదిలా ఉంటే.. సంజయ్ దత్ కూతురు త్రిషాలా దత్ జీవితం కూడా కొంచెం వివాదాస్పదంగానే ఉంటుంది. త్రిషాలా ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే త్రిషాలా కు ఓ విషాదభరితమైన ప్రేమ జీవితం ఉంది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించి .. అతడితో కొంత కాలం రిలేషన్ లో ఉన్నది. ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది. మరో వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. కానీ అర్ధాంతరంగా అతడు చని పోయాడు. దీంతో త్రిషాలా దత్ పై ఎప్పటికప్పుడు వార్తలు వస్తుంటాయి.
తాజాగా త్రిషాలా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చింది. తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలువురు ఫ్యాన్స్ ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు గుప్పించారు. సంజయ్ దత్ కు మొదటి భార్య రిచా శర్మ ద్వారా త్రిషాలా జన్మించిన విషయం తెలిసిందే. శనివారం త్రిషాలా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుండగా ఓ నెటిజన్ మీరు ఎప్పుడైనా మోసపోయారా? అని ప్రశ్నించాడు. దీనికి ఆమె అవునని సమాధానం చెప్పింది. అతడిని మీరు క్షమిస్తారా? అని అడగ్గా లేదని ఆన్సర్ ఇచ్చింది. ఈ బ్యూటీ రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఓ వ్యక్తితో చాలా ఏళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నాను. కానీ అతడి వ్యవహారం నాకు నచ్చలేదు. నేను నా ఫ్రెండ్స్ తో ఉండటం కూడా అతడు సహించలేకపోయాడు. నా వ్యక్తిగత జీవితంపై ఆంక్షలు విధించాడు. అందుకే నేను అతడికి దూరమయ్యాను.
అంతే కాక నిత్యం నన్ను సూటి పోటి మాటలతో మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. అందుకే అతడి నుంచి దూరంగా వెళ్లిపోయాను. అతడు ఇప్పుడు పెళ్లి చేసుకొని హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు’ అని చెప్పు కొచ్చింది త్రిషాలా. ఆ తర్వాత ఓ ఇటాలియన్ కుర్రాడితో త్రిషాలా లవ్ లో పడింది. ఇద్దరూ పీకల్లోతూ ప్రేమ లో మునిగి పోయారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. చివర కు అతడు చని పోయాడు. ఈ విషయాన్ని నేరుగా త్రిషాలా సోషల్ మీడియా వేదిక గా పంచుకున్నది.