తారక్ తండ్రి గారైన హరికృష్ణ ఆకస్మిక మరణం నందమూరి కుటుంబంలో ఎంతో విషాదం నింపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ ఆ ఘటనతో ఎంత పెద్ద షాకయ్యారో.. ఎంతటి ఉద్వేగానికి గురయ్యారో ప్రీరిలీజ్ ఈవెంట్ వీక్షించిన వారికి స్పష్టంగా అర్థమైంది. ఆ ఘటన సమయంలో తన వెన్నంటే ఉండి తనకి అన్నీ తానే అయ్యాడని - తండ్రి సమానుడయ్యాడని త్రివిక్రమ్ ని ఉద్ధేశించి తారక్ అన్నారు. నెలరోజులుగా ఎంతగానో నాలో నేనే నలిగిపోయాను. ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోయానని తారక్ అన్నారు.
ఇదే విషయంపై నేటి ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ని ప్రశ్నిస్తే.. ఆ ఘటన తర్వాత ఎన్టీఆర్ కి సంబంధించి ఎంతో పెద్ద షాకింగ్ నిజాన్ని ఆయన రివీల్ చేశారు. వాస్తవానికి ప్రీరిలీజ్ ఈవెంట్ టైమ్ లో ఎంతో కన్ఫ్యూజన్ గా ఉన్నాను. అప్పటికి హరికృష్ణ గారి మరణం అందరి మైండ్ లో ఉంది. నేనేం మాట్లాడాలనుకున్నా మాట్లాడాలనిపించలేదు. అందుకే నేను ఆరోజు ఈవెంట్ లో అన్నీ తారక్ కే వదిలేశాను. ఆ సమయంలో ఎన్టీఆర్ వెన్నంటి ఉండడమే ఇంపార్టెంట్ అనిపించింది.. అని తెలిపారు.
హరికృష్ణ గారి మరణం గురించి విన్న వెంటనే చినబాబు (నిర్మాత రాధాకృష్ణ) - నేను ఒక నిర్ణయానికి వచ్చేశాం. ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో సమ్మర్ కే రిలీజ్ చేయాలని ఆల్ మోస్ట్ నిర్ణయం తీసుకున్నాం. ఈ డిసెంబర్ - జనవరిలో బోలెడన్ని రిలీజ్ లు ఉన్నాయి. అందకే ఆ నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా ఆ ఘటన జరిగిన రెండో రోజే ఎన్టీఆర్ నాకు ఫోన్ చేశారు. సినిమాని ఆన్ టైమ్ లోనే రిలీజ్ చేద్దాం. షూటింగ్ ప్రారంభించండి..!! అని అన్నాడు. ఆ భరోసాకు - గట్స్ కు మేం షాక్ కి గురయ్యాం. ఆ తర్వాత ఎన్టీఆర్ ఏం చెబితే అదే చేశాం. బ్లడ్ అండ్ సోల్ పెట్టి ఈ సినిమాకి పని చేశాడు... అని త్రివిక్రమ్ కొన్ని షాకింగ్ ట్రూత్స్ ని వెల్లడించారు.