పవన్ - మహేస్ - బన్ని వంటి స్టార్లతోనే పనిచేస్తాడు త్రివిక్రమ్. ఆయన రేంజు సూపర్ స్టార్ల రేంజు. కొడితే కుంభాన్నే కొట్టేయాలనుకుంటాడు. బాక్సాఫీస్ వద్ద మినిమం 50 ప్లస్ క్రోర్స్ వసూలు చేసేయాలి. అందుకే వీళ్లకోసమే ప్రతిసారీ కథలు రాసుకుంటాడు. కానీ ఈసారి ఎందుకనో రూటు మార్చాడు. యంగ్ హీరో నితిన్ తో పనిచేస్తున్నాడు. అ..ఆ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. 50రోజుల పాటు నాన్ స్టాప్ గా చిత్రీకరించాడు. ఇక బ్యాలెన్స్ 80శాతం కూడా పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ మూవీలో నితిన్ ని మునుపటి కంటే కొత్తగా చూపించాలని తపిస్తున్నాడుట. రెగ్యులర్ గా తాను వెళ్లే దారిలో కాకుండా కొత్త దారిలో వెళుతున్నాడుట. ఎంటర్ టైన్ మెంట్ - ఫ్యామిలీ సెంటిమెంటుతో పాటు రొమాన్స్ లో కాస్తంత అడ్వాన్స్డ్ గానే చూపిస్తున్నాడని తెలుస్తోంది. నితిన్ - సమంత జంట మధ్య రొమాంటిక్ సీన్లు అదిరిపోయే రేంజులో ఉంటాయని చిత్రయూనిట్ చెబుతోంది.
జనవరి చివరినాటికి అన్నిపనులు పూర్తిచేసి, ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఆ ప్రకారమే స్పీడ్ గా నిర్మాణానంతర పనులు పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు. జనవరి అంతా ఓ వైపు బ్యాలెన్స్ చిత్రీకరణ పూర్తి చేసి ఎట్టి పరిస్థితిలో ఫిబ్రవరిలో రిలీజ్ చేసేస్తాడని చెబుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేసన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.