పూరి 'పోకిరి'నే కొట్టేలా త్రివిక్ర‌మ్ ప్లానింగ్!

Update: 2022-08-19 12:30 GMT
#ఎస్ ఎస్ ఎంబీ 28వ చిత్రం రిలీజ్ తేదీని యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 28న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సినిమా ప్రారంభం కాకుండానే యూనిట్  ఎంతో  కాన్పిడెంట్ గా తేదీని రివీల్ చేసి మ‌హేష్ ఫ్యాన్స్ ని ఫిదా చేసారు. దీంతో అభిమానుల్లో నిరుత్సాహం కాస్త త‌గ్గింది.

ఎప్పుడెప్పుడా? అని చూస్తున్న ఫ్యాన్స్ కిది ట్రీట్ లా ఉంది. సెట్స్ కి వెళ్ల‌డం ఆల‌స్యం కావ‌డంతో మ‌హేష్  సైతం ఒకానొక ద‌శ‌లో ట్రోలింగ్ గుర‌య్యారు?  ఇంకెప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు?  ఇది ఇప్ప‌ట్లో జ‌రిగేనా అంటూ సెటైర్లు గుప్పించారు. వాట‌న్నింటికి నిన్న‌టితో మాట‌ల మాంత్రికుడు పుల్ స్టాప్ పెట్టేసారు.

మ‌రి ఏప్రిల్ 28వ తేదీని రిలీజ్ చేయ‌డానికి కార‌ణాలు ఏంటి? ఆ తేదీకి ప్ర‌త్యేక‌మైన కార‌ణాలు ఏవైనా ఉన్నాయా? అంటే  ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలుస్తున్నాయి. మ‌హేష్ కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'పోకిరి' 16 ఏళ్ల క్రితం  ఏప్రిల్ 28నే రిలీజ్ అయింది. మ‌హేష్ ని వంద కోట్ల క్ల‌బ్ లో చేర్చిన  తొలి చిత్ర‌మ‌ది. అప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్ కి 100  కోట్ల వ‌సూళ్ల సినిమా  లేదు.

డ్యాషింగ్ డైరెక్ట‌ర్  పూరి జ‌గ‌న్నాధ్ ఎంట‌ర్ అవ్వ‌డంతోనే అది మ‌హేష్ కి సాధ్య‌మైంది.  'అడ‌వి రాముడు'..'బాహుబ‌లి' లాంటి చిత్రాలు సైతం ఏప్రిల్ 28న రిలీజ్ అయి  వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ని సాధించాయి. మ‌హేష్ -త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ అదే సెంటిమెంట్ ని రిపీట్ చేయ‌డానికి 2023-ఏప్రిల్  28న రిలీజ్ తేదీగా లాక్ చేసిన‌ట్లు గెస్ చేయోచ్చు.

ఇక్క‌డే మ‌రో కార‌ణం కూడా తెర‌పైకి వ‌స్తుంది. ఆ మ‌ధ్య‌ మ‌హేష్‌-పూరి మ‌ధ్య చిన్న‌పాటి  డిస్ట‌బెన్సెస్ క్రియేట్ అయిన సంగ‌తి తెలిసిందే. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ని మ‌హేష్ రిజెక్ట్ చేయ‌డం.. ఆ చిత్రాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో  ప్ర‌తిష్టాత్మ‌కంగా మొద‌లు పెట్ట‌డం  తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌హేష్  రేంజ్ హీరోని మ‌రొకర్ని త‌యారు చేస్తాన‌ని సంక‌ల్పించి పూరి రంగంలోకి దిగిన‌ట్లు నెట్టింట జోరుగా ప్ర‌చారం సాగింది.

పూరి గ‌త సినిమాల రికార్డులన్నింటిని తిర‌గ‌రాసేలా సినిమా ఉంటుంద‌ని ఇప్ప‌టికీ నెట్టింట దుమారం రేగుతోంది. స‌రిగ్గా ఇదే వేడిలో ఎస్ ఎస్ ఎంబీ పోకిరి రిలీజ్ తేదీ ఏప్రిల్ 28ని లాక్ చేయ‌డంతో పూరికి పోటీగా దింపుతున్న‌ట్లు కొత్త ప్రచారం తెర‌పైకి వ‌స్తుంది. త‌న రికార్డును తానే తిర‌గ‌రాసి ఆ ఖ్యాతిని మాట‌ల మాంత్రికుడు కి క‌ట్ట‌బెట్టే ప్లాన్ తోనే సీన్ లోకి వ‌స్తున్న‌ట్లు  ఫిలిం స‌ర్కిల్స్ లో గుస‌గుస మొద‌లైంది.
Tags:    

Similar News