టాలీవుడ్‌కు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కల్చర్ పరిచయం చేయడం అల్లు అర్జున్‌కు అలవాటు. తెలుగు హీరోల్లో సిక్స్ ప్యాక్ చేసిన తొలి హీరో అతనే. స్టయిలింగ్ విషయంలోనూ అతను చాలామందికి మార్గదర్శి. బన్నీ పరిచయం చేసిన మరో కల్చర్.. లిప్ లాక్. వేదం, ఆర్య-2, వరుడు సినిమాల్లో హీరోయిన్లతో పెదవి ముద్దులు లాగించేశాడు అల్లు వారి పిల్లోడు. తన కొత్త సినిమా 'సన్నాఫ్ సత్యమూర్తి'లోనూ కొత్త బ్యూటీ ఆదా శర్మ పెదవి అందుకున్నాడట. షూటింగ్ టైంలో త్రివిక్రమ్ కూడా ఈ లిప్ లాక్ విషయంలో టెంప్ట్ అయిపోయి షూట్ చేసేశాడట.
ఐతే తనకున్న ఫ్యామిలీ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమే స్వయంగా ఆ పెదవి ముద్దుకు కత్తెర వేసేసినట్లు చెప్పుకుంటున్నారు. సెన్సార్‌కు వెళ్లి.. ఎ సర్టిఫికెట్ తెచ్చుకోవడం.. తనను నమ్మి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టడం ఎందుకని భావించి సెన్సార్‌కు వెళ్లడానికి ముందు త్రివిక్రమే ఆ సన్నివేశాన్ని తీయించేశారట. త్రివిక్రమ్ మొదటి నుంచి క్లీన్ ఎంటర్టైనర్స్ తీస్తూ వస్తున్నాడు. ఈ హీరోయిన్‌ను కూడా కొంచెమైనా వల్గర్‌గా చూపించింది లేదు. ఎలాగూ 'సన్నాఫ్ సత్యమూర్తి'కి రావాల్సినంత క్రేజ్ వచ్చేసినపుడు.. అంతమంచి ట్రాక్ రికార్డును తన చేత్తో తాను దెబ్బ తీసుకోవడం ఎందునుకున్నాడో ఏమో.