త్రివిక్రమ్ గతంలో తీసిన సినిమాలు గుర్తుకు తెచ్చుకోండి. అందులో క్యారెక్టర్లు మరీ ఎక్కువుండేవి కావు. ఒకవేళ ఉన్నా.. చిన్న చిన్న క్యారెక్టర్లకు కూడా ప్రాధాన్యం ఉండేలా చూసుకునేవాడు. కానీ రానురానూ క్యారెక్టర్లు పెంచేయడం.. కొన్ని క్యారెక్టర్లను ఊరికే తెరమీద అలా ఇలా తిరగడానికి మాత్రమే ఉపయోగించుకోవడం ఎక్కువైంది. జులాయి, అత్తారింటికి దారేది సినిమాలు దీనికి ఉదాహరణ. ఐతే ఆ రెండు సినిమాలు బాగా ఆడటంతో ఈ విషయం పెద్దగా హైలైట్ కాలేదు. ఐతే తెరమీద ఎన్ని ఎక్కువ క్యారెక్టర్లుంటే అంతగా సందడి ఉంటుంది.. జనాలు అంత బాగా కనెక్టయిపోతారని అనుకున్నాడో ఏమోగానీ.. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో ఇబ్బడి ముబ్బడిగా క్యారెక్టర్లు దించేశాడు త్రివిక్రమ్.
ఐతే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైపోతుంది అన్నట్లుగా తయారైంది పరిస్థితి. క్యారెక్టర్లు మరీ ఎక్కువైపోయేసరికి ఎవరికీ పెద్దగా ప్రాధాన్యం లేకపోయింది. ఏ క్యారెక్టర్ మీదా త్రివిక్రమ్ శ్రద్ధ పెట్టినట్లు కనిపించలేదు. అన్నీ బేలగా తయారయ్యాయి. ఒక్క హీరో పాత్ర మాత్రమే బలంగా కనిపించింది. సినిమాకు ఎంతో కీలకమవుతుందనుకున్న ఉపేంద్ర పాత్ర తేలిపోయింది. స్నేహ లాంటి హీరోయిన్‌ను అలాంటి ప్రాధాన్యం లేని పాత్రకు ఎందుకు తీసుకున్నారో ఏంటో?
కోట లాంటి నటుణ్ని చిన్న సహాయ పాత్రకు పరిమితం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. హీరోయిన్లలో కూడా ఉన్నంతలో సమంత బెటర్. ఆదా శర్మ, నిత్యామీనన్‌లవి ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రలు. ఏదో ఉన్నామంటే ఉన్నామనిపించారంతే. ఆలీ హీరోతో పాటు సినిమా అంతా ట్రావెల్ చేసినా పొడిచిందేమీ లేదు. ఒక్క సీన్లోనూ నవ్వించలేకపోయాడు. రాజేంద్ర ప్రసాద్‌ను కూడా త్రివిక్రమ్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సింధు తులాని కూడా ఏదో ఉందంటే ఉందంతే. కృష్ణచైతన్య, పవిత్ర లోకేష్, సంపత్, వెన్నెల కిషోర్.. ఇలా చెప్పుకుంటూ పోతే క్యారెక్టర్లకు మాత్రం ఢోకా లేదు. కానీ ఆ క్యారెక్టర్లలో బలమే లేకపోయింది. ప్రేక్షకులు బాగా డిజప్పాయింటయ్యింది ఇక్కడే.