జూనియర్ సౌందర్యగా నిత్యామీనన్ కి ఉన్న ఫాలోయింగ్ అసాధారణం. తెలుగు పరిశ్రమను కాదనుకుని దూరంగా ఉన్నా నిత్యాని అభిమానించే వాళ్లు మాత్రం తనని ఎంత మాత్రం మర్చిపోలేకపోతున్నారు. ఇటీవలే ఈ భామ నటించిన బాలీవుడ్ చిత్రం `మిషన్ మంగళ్` బ్లాక్ బస్టర్ కొట్టింది. అక్షయ్ కుమార్ కెరీర్ లో మరో క్లాసిక్ హిట్ గా నిలవగా .. సైంటిస్టు పాత్ర చేసిన నిత్యాకి ఉత్తరాదిన ప్రత్యేక గౌరవం దక్కింది. మొన్న మిషన్ మంగళ్ ప్రచార వేదికపై కిలాడీ అక్షయ్ కుమార్ అన్న ఓ మాటను అభిమానులు పదే పదే తలుచుకుంటున్నారు. `నీ తిండికి ఓ దండం తల్లీ` అంటూ నిత్యాని అక్కీ సరదాగా ఆట పట్టించారు.
అయితే ఈ తిండి అలవాటు వల్లనో లేక ఇంకేదైనా హార్మోనల్ సమస్య వల్లనో కానీ నిత్యా అంతకంతకు బొద్దుగా మారుతోంది. అయితే ఇటీవల ఈ బొద్దుతనంపై రకరకాలుగా సామాజిక మాద్యమాల్లో ట్రోల్స్ ఎదుర్కొంది. ఇదంతా కేవలం తాను నటించనున్న `ది ఐరన్ లేడీ` బయోపిక్ కోసమేనని అభిమానుల్లో మరోవైపు చర్చ సాగుతోంది. అమ్మ జయలలిత పాత్రలో నటిస్తున్న నిత్యా ఆ పాత్ర కోసం బరువు పెరిగేందుకు బాగా తింటోందట. అందుకే మునుపటితో పోలిస్తే ఇలా ఇంకా బొద్దుగా మారిపోయి కనిపిస్తోంది. అయితే నిత్యా అలా బరువు పెరగడానికి హార్మోన్స్ ప్రభావం కారణం అంటూ మరోవైపు ప్రచారం సాగుతోంది. అయితే ఈ కామెంట్లు అన్నిటిపైనా నిత్యా ఇదివరకూ రివర్స్ కౌంటర్లు వేసారనుకోండి.
అయితే నిత్యా బరువుతో సంబంధం లేకుండా తనకు వరుసగా క్రేజీ చిత్రాల్లో అవకాశాలొస్తున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకురాలు జయలలిత పాత్రలో నటిస్తున్న ఈ అమ్మడికి మలయాళంలో బోలెడన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే తన ఎన్ని సినిమాలు చేసినా టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించిన `కోలాంబి` తన కెరీర్ లో స్పెషల్ సినిమా అని చెబుతోంది నిత్యా. కథాంశంలో ఎంతో ఘాడత ఉందని రకరకాల పార్శ్యాల్ని టచ్ చేస్తూ తెరకెక్కించిన సినిమా ఇదని తెలిపింది. దర్శకరచయిత టీకే రాజీవ్ శైలి వేరు. ఆయనతో పని చేయడం నా డ్రీమ్. తనతో కలిసి తలసమయం ఒరు పెన్ కుట్టి అనే చిత్రంలో నటించాను. ఎంతో వైవిధ్యమైన కథల్ని ఎంచుకోవడం ఆయన ప్రత్యేకత అంటూ పొగిడేసింది నిత్యా.