నీతులు చెప్పడం మహా సులువు. మీరు ఎవరినైనా డబ్బు అడిగితే ఇవ్వరు కానీ సలహాలు చెప్పమన్నా.. నీతిబోధ చెయ్యమన్నా వెంటనే వారి లోపలిమనిషి బయటకొచ్చి అన్నీ చెప్పేస్తారు. కానీ వాటిని ఆచరిస్తారా? ఆ ఒక్కటి మాత్రం అడక్కండి. బాలీవుడ్ కమ్ టాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను.. సరిగా ఇక్కడే విమర్శకులకు చిక్కింది. తాప్సీ చాలా విషయాలపై తన అభిప్రాయాలను ఓపెన్ గా చెప్పేస్తుంటుంది. కొద్ది రోజుల క్రితం 'కబీర్ సింగ్' వయోలెంట్ లవ్ పై కూడా సెటైర్లు వేసింది. కొందరు బాలీవుడ్ క్రిటిక్స్ కూడా కబీర్ సింగ్ ను దుమ్మెత్తిపోసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా 'మిషన్ మంగళ్' ట్రైలర్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో కంటెంట్ కాదు.. ఆ ట్రైలర్ లో ఉన్న ఒక చిన్న సీన్ పై ఇప్పుడు భారీగా ట్రోలింగ్ సాగుతోంది. కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న తాప్సీని పక్కన కూర్చున్న ట్రైనర్ టాప్ గేర్ వెయ్యమంటాడు. ముందుగా రోడ్డును తీక్షణంగా చూస్తూ ఎడమ చేతిని ఆ ట్రైనర్ ప్యాంట్ జిప్పు దగ్గరకు పోనిచ్చి గట్టిగా గేరు వేస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇంకేం జరుగుతుంది.. ట్రైనర్ కెవ్వున అరుస్తూ కేకలు పెడతాడు.
ఇది అడల్ట్ జోకు కాదని ఎవరైనా అనగలరా? ఈమధ్య 'కబీర్ సింగ్' పై రెచ్చిపోయి కామెంట్లు చేసిన తాప్సీ ఇప్పుడు చేసిన సీన్ ఎలాంటిదని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 'కబీర్ సింగ్' ది టాక్సిక్ మాస్క్యులినిటీ అయితే ఇది టాక్సిక్ ఫెమినినిటి(వీటికి తెలుగు సమానార్థకాలు రాయడం కంటే రాయితో నెత్తి బాదుకోవడం మేలు!) కదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే సీన్ కనుక రివర్స్ లో జరిగితే ... అంటే అబ్బాయి డ్రైవర్ గా అమ్మాయి ట్రైనర్ గా ఉంటే నీతో పాటు బాలీవుడ్ క్రిటిక్స్ కూడా గగ్గోలు పెట్టి ఉండేవారు కదా అంటూ తలంటుతున్నారు. నువ్వో టాక్సిక్ ఫెమినిస్టు అంటూ పంచ్ వేస్తున్నారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. బూతులు.. జఫ్ఫా విమర్శలు అన్నీ పక్కన పెట్టి.. ఓపెన్ మైండ్ తో చూస్తే మాత్రం సీన్ మాత్రం అదిరిందబ్బా..