వర్మ ట్రాప్ లో పడని ఆ ఇద్దరూ

Update: 2019-05-06 10:43 GMT
కేవలం వివాదాల ద్వారా వచ్చే పబ్లిసిటీతో ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకుని పెట్టిన అతి తక్కువ బడ్జెట్ ని లాభాలతో సహా వెనక్కు వచ్చేలా చేసుకునే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే చేశాడు. ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకపోయినా మిగలిన చోట్ల వచ్చిన వసూళ్ళతో ఏదో ఒకరకంగా పాస్ అనిపించుకుంది కాని ఇదీ వర్మ మార్క్ సినిమా అయితే కాదనే కామెంట్స్ బలంగా వినిపించాయి.

ఇదిలా ఉంచితే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మీద వర్మ అన్నౌస్ చేసిన టైగర్ కెసిఆర్ గురించి టీవీ మీడియా సహాయంతో వర్మ అప్పుడే ప్రమోట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. షూటింగ్ ఇంకా జరుగుతుందో లేదో తెలియదు కాని రిలీజ్ రేంజ్ హడావిడి మొన్నో ఇంటర్వ్యూ ద్వారా చేశాడు

ఇలా చేయడం ద్వారా టిఆర్ ఎస్ క్యాడర్ నో లేదా కేటిఅర్ నో ఆకర్షించి తద్వారా ఏదైనా మైలేజీ సాధిద్దాం అనుకుంటున్న వర్మ ప్రయత్నాలు అంతగా ఫలిస్తున్నట్టు లేదు. వాళ్ళు కనీసం దీన్ని పట్టించుకుంటున్న దాఖలాలు కూడా లేవు. కెసిఆర్ మీద ఎవరు బయోపిక్ తీసినా టిఆర్ ఎస్ వర్గాలు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు.

సినిమాల మీద అవగాహన ఉన్న కేటిఆర్ సైతం తెలివిగా వ్యవహరిస్తూ నాన్న బయోపిక్ ని వర్మ తీస్తున్నాడు అనే విషయం తనకు తెలియదు అనేలా వ్యవహరించడం వర్మకు ప్లస్ అయ్యేది కాదు. అందుకే వాళ్ళ అటెన్షన్ తీసుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా వర్మ ఎత్తులు మాత్రం చిత్తవుతున్నాయి
    

Tags:    

Similar News