రామ్ కి, ఓ తెలుగు న్యూస్ ఛానల్ కి వివాదంలో కొత్త అప్ డేట్ వచ్చింది. హీరో రామ్ ఇచ్చిన ఓ ఆఫర్ ను.. ఓ జర్నలిస్ట్ కాదన్నాడు. ఉచితంగా ప్రతీ నెలా జీతం ఇస్తానన్నా అవసరంలేదని చెప్పేశాడు. నేను శైలజ చిత్రానికి బ్యాడ్ రేటింగ్ ఇచ్చిన ఛానల్ పై రామ్ ట్విట్టర్ దాడి చేశాడు. ప్రేక్షకులకు నచ్చి కలెక్షన్స్ వస్తున్నా, విమర్శకులు కూడా బాగుందని చెప్పినా.. ఆ ఛానల్ కి మాత్రం ఎందుకో నచ్చలేదని అన్నాడు హీరో రామ్.
అయితే.. ఇలాంటి రివ్యూకు ఆ ఛానల్ లో పని చేసే నవీన్ అనే ఉద్యోగి వ్యతిరేకంగా మాట్లాడ్డంతో.. అతన్ని ఉద్యోగంలోంచి తొలగించింది ఆ ఛానల్ యాజమాన్యం. దీనిపై కూడా ప్రత్యక్షంగానే స్పందించాడు హీరో రామ్. ఇలా తన సినిమాను సపోర్ట్ చేసి ఉద్యోగం పోగొట్టుకున్న తన అభిమాని నవీన్ కి అండగా నిలబడతానన్న రామ్.. ప్రతీ నెలా తన ఆఫీస్ కి వచ్చి జీతం తీసుకోవాల్సిందిగా సూచించాడు. కానీ అతను మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. అంతే కాదు.. తాను ఎందుకు ఈ ఆఫర్ వద్దంటున్నాడో.. సినిమా స్టయిల్లో పంచ్ డైలాగ్ రేంజ్ లో చెప్పాడు.
'జీతం కోసం జాబ్ చేస్తాను కానీ.. జీతం కోసమే జాబ్ కాదు. ఖాళీగా ఉన్నా, కష్టంగా ఉన్నా ఇష్టమే, అంతే తప్ప ఉచితంగా డబ్బులు తీసుకోను' అని చెప్పాడు. దీంతో షాక్ తినాల్సిన వంతు రామ్ ది అయింది. అంతే కదా.. అభిమాని అయినంత మాత్రాన అభిమానం వదిలేస్తాడా!