టీవీ తారల రేటు వింటే మైండ్ బ్లాంక్

Update: 2017-01-24 09:50 GMT
సినిమాల్లో స్టార్స్ గా ఎదిగిన వాళ్లు కోట్ల కొద్దీ రెమ్యూనరేషన్ తీసుకోవడం చాలామందికే తెలుసు. కానీ.. బుల్లితెరపై నటిస్తూ కూడా.. దాదాపు అంతకు సమానంగానూ.. అంతకంటే ఎక్కువ మొత్తాన్ని సంపాదించేస్తున్న వాళ్లు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. 2016లో అత్యధికంగా ఆర్జించిన టెలివిజన్ స్టార్స్ రెమ్యూనరేషన్ లెక్కలు వింటే.. ఎవరికైనా మైండ్ బ్లాంక్ కావాల్సిందే.

కామెడీ షోలతో ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయి కపిల్ శర్మ.. పారితోషికం ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కు 60 నుంచి 80 లక్షలు అందుకుంటాడు. తాజాగా ఓ వివాదంలో తాను 150 కోట్ల ఇన్ కం ట్యాక్స్ కడుతున్నా అని స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇక కపిల్ కి కోస్టార్ గా కనిపించే సునీల్ గ్రోవర్ కూడా భారీగానే సంపాదించేస్తున్నాడు. ఒక్కో ఎపిసోడ్ కి 10 నుంచి 12 లక్షలు అందుకుంటున్నాడు సునిల్ గ్రోవర్.

రోనిత్ రాయ్-రామ్ కపూర్ లు అటు సినిమాలకు.. ఇటు టీవీలకు కలిపి హోస్టింగ్ చేస్తుంటారు.. యాక్టింగ్ చేస్తుంటారు. వీరికి ఒక్కో ఎపిసోడ్ కి లక్షా 25వేల మొత్తం ముడుతుంది. హిందీ టెలివిజన్ లో బాగా ఫేమస్ అయిన హీనా ఖాన్(ఏ రిస్తా క్యా కహత్ హై).. కరణ్ పటేల్(ఏ హై మొహబ్బతే) లు.. ఒక్కో ఎపిసోడ్ కు 1 లక్ష నుంచి 1 లక్షా 25వేలు ఛార్జ్ చేస్తుంటారు. ఇక దివ్యాంక త్రిపాఠి(యే హై మొహబ్బతే).. మోహిత్ రైనా(చక్రవర్తి అశోక్ సమ్రాట్).. ద్రష్టి ధామి(పర్ దేశ్ మే హై మేరా దిల్)లు కూడా ఒక్కో ఎపిసోడ్ కు లక్ష రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News