MAA రాజీనామాల ట్విస్టు.. వాట్టూడూ? వాట్ నాట్టూడూ?

Update: 2021-10-24 06:35 GMT
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (MAA) ఎన్నిక‌ల్లో మంచు విష్ణు గెలుపు అనంత‌రం.. ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ నుంచి గెలిచిన స‌భ్యులు రాజీనామాలు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి  తెలిసిందే. ముందుగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు రాజీనామా.. ఆ త‌ర్వాత ప్ర‌కాష్ రాజ్ స‌హా మిగ‌తా వారంతా ఒకేతాటిపైకి వ‌చ్చి రాజీనామాలు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు రాజీనామాలు లిఖిత పూర్వకంగా త‌న‌కు అంద‌లేద‌ని.. అలా అందితే ఆ త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటాన‌ని అప్పుడే తెలిపారు. ఈనేప‌థ్యంలో తాజాగా ఆ రాజీనామాలు `మా` అధ్య‌క్షుడు హోదాలో ఉన్న విష్ణుకు అందిన‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో రాజీనామాల్ని విష్ణు తిర‌స్క‌రించారు. ప్ర‌కాష్ రాజ్ ఫ్యాన‌ల్  నుంచి  గెలిచిన వారంతా త‌మ‌ ప‌దువుల్లో కొన‌సాగేలా `మా` త‌రుపున లేఖ‌లు రాయాల‌ని  ఇటీవ‌ల జ‌రిగిన  ఈసీ మీటింగ్ లో నిర్ణ‌యించారు. రెండు గంట‌ల పాటు జ‌రిగిన ఈ స‌మావేశంలో `మా` లో ఉన్న స‌మ‌స్య‌ల‌పై డిస్క‌ష‌న్ జ‌రిగింది. మ్యానిఫెస్టో లో ప్ర‌క‌టించిన 14 అంశాల‌పైనా  చ‌ర్చించారు. ఇప్ప‌టికే పెన్ష‌న్ ఫైలు పై విష్ణు తొలి సంత‌కం చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే `మ‌హిళా సాధికార‌త` పై సునీతా కృష్ణ‌న్ ఆధ్వ‌ర్యంలో  ముగ్గురు మ‌హిళ‌లు..ఇద్ద‌రు పురుషుల‌తో  క‌మిటీ కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆసంగ‌తి ప‌క్క‌న‌బెడితే..

మంచు విష్ణు తాజాగా తీసుకున్న నిర్ణ‌యంపై ప్ర‌కాష్ రాజ్ అండ్ కో ఎలా స్పందిస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. విష్ణు గెల‌వ‌గానే రాజీనామాలు చేసిన‌వారు ఇప్పుడు అదే విష్ణు మీరు కూడా `మా`తో కొన‌సాగండ‌ని లేఖ‌లు రాయ‌డానికి సిద్ద‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో రాజీనామాలు స‌మ‌ర్పించిన వారంతా పున‌రాలోచిస్తారా?  లేక  మొండిగా రాజీనామాల‌కే  మొగ్గు చూపుతారా? అన్న‌ది చూడాలి. ఈ విష‌యంలో రెండు ప్యాన‌ల్ స‌భ్యుల మ‌ధ్య కొంత స్త‌బ్ధ‌త ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.  

రెండేళ్లు నిద్ర‌పోనివ్వ‌న‌ని అన్నారు క‌దా!

న‌టుడిగా త‌న‌దైన ముద్ర వేసిన ప్ర‌కాష్ రాజ్ ఇటీవ‌ల `మా` ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మి పాల‌య్యాక ఇప్ప‌టికీ ఆయ‌న చాలా సీరియ‌స్ గానే ఉన్నారు.  మంచు విష్ణు వ‌ర్గం లాక్కుంద‌ని.. పోల్ మేనేజ్ మెంట్ చేశార‌ని.. తాను గుద్దించుకుని సంపాదించుకున్న ఓట్ల‌తో గెల‌వ‌లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  `మా` స‌మ‌రంలో నేను పావుని అయిపోయాన‌ని అనుకుంటున్నారు. కానే కాద‌ని కూడా అన్నారు.

పెద్ద‌రికాల‌ని ప్ర‌శ్నిస్తున్నాను. ఎటు వెళ్లినా వీడు డేంజ‌రే అనేలా చేస్తున్నాను. ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి కూడా ఆర్టిస్టులు రావాలని మంచు విష్ణు అంటున్నాడు.. ఈ రెండేళ్లు నిదుర‌పోనివ్వ‌ను.. ప్ర‌శ్నిస్తూనే వుంటాను. ప్ర‌తీవారం రిపోర్ట్ కార్డ్ అడుగుతాను. ప‌ని నువ్వు చేస్తావా? న‌న్ను చేయ‌మంటావా? అని నిల‌దీస్తాను. ఎవ్వ‌రినీ ప్ర‌శాంతంగా వుండ‌నివ్వ‌ను.. మ‌నుషులు మారాలి... `మా `మారాలి `ని ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. అందుకు త‌గ్గ‌ట్టే విష్ణుపై త‌న పోరాటాన్ని అవిశ్రామంగా కొన‌సాగిస్తున్న‌ట్టే కనిపిస్తోంది. 2021 -23 సీజ‌న్ కి విష్ణు అధ్య‌క్షుడిగా కొన‌సాగుతారు. మ‌ళ్లీ ఎల‌క్ష‌న్ వ‌చ్చే వ‌ర‌కూ అత‌డి కంటికి కునుకు క‌ష్ట‌మే మ‌రి. `మా` ఎన్నిక‌ల ఓట‌మి అనంత‌రం ప్ర‌కాష్ రాజ్ ర‌క‌ర‌కాల డైల‌మాల్లో ఉన్నార‌ని కూడా మ‌రో వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో మెగాస్టార్ అతడికి స‌పోర్టుగా నిల‌వ‌లేద‌ని అందుకే ఓట‌మి పాలయ్యాడ‌నే వ‌ర్గం కూడా ఉంది. ఎల‌క్ష‌న్ లో కేవ‌లం నాగబాబు మాత్ర‌మే ముందుండి క‌థ న‌డిపించారు. అది ప్ర‌కాష్ రాజ్ కి క‌లిసి రాలేద‌ని విశ్లేషిస్తున్నారు కొంద‌రు.
Tags:    

Similar News