టాలీవుడ్ లో యువహీరోల హార్డ్ వర్కింగ్ నేచుర్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎంచుకున్న పాత్రకు అవసరమయ్యే విధంగా లుక్ ని మార్చేందుకు జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ కఠిన ఆహార నియమాల్ని పాటిస్తున్నారు స్టార్లు. లైగర్ చిత్రం కోసం విజయ్ దేవరకొండ జిమ్ముల్లో ఎంతగా శ్రమిస్తున్నారో చూస్తున్నదే.
అలాగే హీరో సందీప్ కిషన్ కూడా ఇటీవల జిమ్ లో ఎంతో క్రమశిక్షణతో కష్టించానని తెలిపారు. A1 ఎక్స్ ప్రెస్ చిత్రంలో సందీప్ హాకీ ప్లేయర్ గా నటిస్తున్నారు. అందువల్ల ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. దీనికోసం క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్లానని సందీప్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతకీ సుందీప్ జిమ్ సహచరుడు ఎవరు? అంటే విజయ్ దేవరకొండ అని చెప్పారు.
ఫిట్ నెస్ ను కాపాడుకోవడమే కాకుండా అతని ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా జిమ్ కు వచ్చే విజయ్ దేవరకొండ నుంచి చాలా నేర్చుకున్నానని సందీప్ తెలిపారు. సింగిల్ గా జిమ్ చేయడం కంటే ఒకరితో కలిసి జిమ్ చేస్తే రిజల్ట్ కూడా అంతే బావుంటుంది.సందీప్.. విజయ్ దేవరకొండ ఫిజికల్ అప్పియరెన్స్ అమాంతం మారింది. 6 ప్యాక్ లుక్ తో పాటు కండలు మెలితిరిగి దేహధారుడ్యం పరంగా చాలా బెటర్ మెంట్ చూపిస్తున్నారు.
దేవరకొండ ప్రస్తుతం లైగర్ చిత్రీకరణలో బిజీగా ఉంటే ..ఈ శుక్రవారం (మార్చి 5 న) విడుదల కానున్న ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రచారంలో సందీప్ బిజీగా ఉన్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తరహాలోనే `ఎ1 ఎక్స్ ప్రెస్` అనే టైటిల్ ను క్యాచీగా ఉందనే ఎంచుకున్నారట. లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. హాకీ ప్లేయర్ గా సందీప్ పెర్ఫామెన్స్ ఎలా ఉండనుందో వేచి చూడాలి.