మొదటి రోజే సామ్ పాజిటివ్ టర్న్

Update: 2018-09-14 08:08 GMT
భర్త సినిమాతోనే పోటీ పడాల్సి వచ్చిన విచిత్రమైన స్థితిని ఎదురుకున్న సమంతా తన యుటర్న్ తో బాగానే మెప్పిస్తోంది. టాక్ డివైడ్ గా లేకపోగా ఇలాంటి సినిమాలు ఇష్టపడే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో వసూళ్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల దాకా జరిగింది కాబట్టి ఇప్పుడున్న టాక్ సేఫ్ గా తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 1 కోటి దాకా షేర్ రావడం విశేషమనే చెప్పాలి. ఇంత కన్నా ఎక్కువ టాక్ హైప్ తో వచ్చిన గూఢచారి మొదటి రోజు తెచ్చింది 70 లక్షల లోపే. నాగార్జున ఆఫీసర్ డిజాస్టర్ అయినప్పటికీ ఫుల్ రన్ లో కోటి చేరుకోవడానికి అష్టకష్టాలు పడింది. ఈ లెక్కన సామ్ ఒక్క రోజు అందులోనూ గురువారం విడుదల అడ్డంకిని తట్టుకుని కోటి షేర్ తేవడం అంటే చిన్న విషయం కాదు. పైగా మాస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శైలజారెడ్డి అల్లుడుని ఫేస్ చేసి వసూళ్లు రాబట్టుకోవడం అసలు ట్విస్ట్. ఇక ఏరియాల వారీగా యుటర్న్ లెక్కలు ఇలా ఉన్నాయి.

నైజామ్ - 35 లక్షలు

సీడెడ్ - 10 లక్షలు

ఉత్తరాంధ్ర - 17 లక్షలు

గుంటూరు - 14 లక్షలు

ఈస్ట్ గోదావరి - 11 లక్షలు

వెస్ట్ - 6 లక్షలు

కృష్ణా - 14 లక్షలు

నెల్లూరు - 3 లక్షలు

రెండు తెలుగు రాష్ట్రాల మొదటి రోజు షేర్ - 1 కోటి 10 లక్షలు

సో బిజినెస్ ప్రకారం చూసుకున్నా మొదటిరోజే పదిహేను శాతం పైగా వెనక్కు ఇచ్చిన యుటర్న్ రైట్ ట్రాక్ మీద ఉందనే చెప్పాలి. వచ్చే వారం నన్ను దోచుకుందువటే తప్ప ఇంకే పెద్ద రిలీజ్ లేవు. దేవదాస్ రావడానికి ఇంకా 14 రోజుల సమయం ఉంది. సో ఎంత లేదన్నా ఈ వారంలో వసూళ్లను కనక స్టడీగా నిలబెట్టుకుంటే ఫైనల్ రన్ లోపు 7 కోట్లను దాటేయొచ్చు. సూపర్ హిట్ అనే ముద్ర కూడా పడిపోతుంది. కానీ సోమవారం నుంచి కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీదే ఇది ఆధారపడి ఉంది. మౌత్ టాక్ తో బాగా స్ప్రెడ్ అవుతున్న యుటర్న్ ఈ ఏడాది బ్రేకులు లేని సమంతా జైత్రయాత్రను కంటిన్యూ చేసేలా ఉంది.


Tags:    

Similar News