ట్రెండీ టాక్‌: CM స‌న్ భార‌తీయుడి పాలిట దేవుడు!

Update: 2022-06-09 03:57 GMT
కమల్ హాసన్ నటించిన `విక్రమ్` ప్రపంచవ్యాప్తంగా విడుద‌లై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి -ఫహద్ ఫాసిల్ తో పాటు సూర్య కూడా ఒక ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. విక్ర‌మ్ ఇప్పుడు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ మూవీకి అనిరుధ్ పెప్పీ బీజీఎం తో పాటు థ్రిల్ల‌ర్ కి త‌గ్గ‌ట్టు అద్భుత‌ సంగీతం అందించారు.

తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్లో ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ క‌మ‌ల్ అభిమానుల్ని ఖుషీ చేసింది. విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ లాంగ్ టైమ్ పెండింగ్ ప్రాజెక్ట్ `ఇండియన్ 2` రీలాంచ్ కోసం ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని ప్ర‌క‌టించారు. నిర్మాత కం నటుడు ఉదయనిధి స్టాలిన్ ఈ ప్రాజెక్టుకి బ్యాకింగ్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆ మేర‌కు సీఎం స్టాలిన్ స‌న్ ఉద‌య‌నిధి స్టాలిన్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించడంతో భార‌తీయుడు అభిమానుల్లో ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయింది.

శివకార్తికేయన్ నటించిన `డాన్` సక్సెస్ మీట్ లో ఉదయనిధి పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లోనే అత‌డు అధికారికంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఉద‌య‌నిధి మాట్లాడుతూ .. మేము నిన్నటి నుండి సుభాస్కరన్ (లైకా ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు)తో మాట్లాడుతున్నాం.  మా స‌హ‌కారంపై త్వ‌ర‌లోనే  వెల్లడించగలనని అనుకుంటున్నాను. భారతీయుడు 2 పనిని తిరిగి ప్రారంభిస్తాం`` అని ప్ర‌క‌టించారు. డాన్- విక్రమ్ చిత్రాల విజయంపై వేదికపై అత‌డు అభినందనలు తెలిపారు.

ఎట్ట‌కేల‌కు ప్ర‌య‌త్నాలు ఫ‌లించిన‌ట్టే

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ - శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `భార‌తీయుడు`(1996) ఎంత‌టి సంచ‌ల‌నాలు సృష్టించిందో తెలిసిందే. దాదాపు రెండు ద‌శాబ్ధాల అనంత‌రం ఈ సినిమాకి సీక్వెల్ ని తెర‌కెక్కిస్తుండ‌గా బ్రేకులు ప‌డ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. క‌మ‌ల్ -శంక‌ర్ బృందం లైకాతో క‌లిసి ఈ ప్ర‌య‌త్నం ప్రారంభించింది. కొంత  షూటింగ్ అయ్యాకా ఊహించ‌ని అవాంత‌రాలు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల గొడ‌వ‌లు ఇబ్బందిగా మారాయి. ఇటీవ‌ల కొంత‌కాలంగా భార‌తీయుడు 2 చిత్రీక‌ర‌ణ నిలిచిపోవ‌డంతో అభిమానులు తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు. కోర్టు గొడ‌వ‌ల‌తో సినిమా చిత్రీక‌ర‌ణ డిలే అయిన ఈ మూవీకి స్టాలిన్ బ్యాకింగ్ యాడ‌వ్వ‌డంతో ఇప్ప‌టికి హుషారొచ్చిన‌ట్ట‌య్యింది.  విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ స్వ‌యంగా పూనుకుని శంక‌ర్ కి లైకాకి మ‌ధ్య స‌యోధ్య‌ను కుదిర్చారు. అలాగే స్టాలిన్ తో ఆయ‌న మంత్రాంగం న‌డిపించార‌ని స‌మాచారం.

ఇటీవ‌ల‌ భార‌తీయుడు 2 ఎప్ప‌టి నుంచి సెట్స్ కెళుతుంది? అన్న‌దానికి క‌మ‌ల్ హాస‌న్ `విక్ర‌మ్` రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో జ‌వాబిచ్చారు. ప్ర‌స్తుతం శంక‌ర్ ఆర్.సి 15తో బిజీగా ఉన్నారు. ఇది పూర్త‌య్యాక భార‌తీయుడు 2 సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలిపారు. అలాగే తాను భార‌తీయుడు 2 కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోన‌ని ఏడాదికి రెండు మూడు సినిమాల‌తో న‌టుడిగా బిజీగా ఉంటాన‌ని కూడా ఆయ‌న ధృవీక‌రించార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఇన్ని అడ్డంకులు ఊహించ‌నివి!

లైకా సంస్థ‌తో ద‌ర్శ‌కుడు శంక‌ర్ కి తొలి నుంచి సింక్ కుద‌రని సంగ‌తి తెలిసిందే. ఇరువ‌ర్గాల‌ న‌డుమా వివాదాలు ఆగ‌లేదు. సెట్లో క్రేన్ యాక్సిడెంట్ లో మ‌ర‌ణాలు.. ఆ తర్వాత కోర్టు గొడ‌వ‌లు తెలిసిందే.
ఈ ఆల‌స్యం కార‌ణంగానే.. భార‌తీయుడు 2 నుంచి క‌థానాయిక కాజల్  త‌ప్పుకుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే దీనిపై అధికారిక ధృవీక‌ర‌ణ లేదు. సిద్ధార్థ్- రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియా భవానీ శంకర్ ఇండియ‌న్ 2లో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భార‌తీయుడు 2 (ఇండియ‌న్ 2) అదే పేరుతో 1996లో వచ్చిన చిత్రానికి సీక్వెల్. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ ఈ ప్రాజెక్టును అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఉద‌య‌నిధి స్టాలిన్ నిర్మాత‌ల్లో ఒక‌రిగా చేరారు. ఇక‌పై ఆయ‌న నుంచి భారీ ఫైనాన్స్ అంద‌నుంది. అనిరుధ్ రవిచందర్ ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
Tags:    

Similar News