ఉడ్తా పంజాబ్‌ కు 100కు పైగా సెన్సార్ క‌ట్స్

Update: 2016-06-22 03:24 GMT
అదేంటి.. ఒకే ఒక్క క‌ట్ తో సెన్సార్ బోర్డు ‘ఉడ్తా పంజాబ్‌’కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది క‌దా.. మ‌ళ్లీ ఈ 100 క‌ట్స్ మాటేంటి అంటారా..? ఇది మ‌న దేశంలో కాదులెండి. పొరుగుదేశం పాకిస్థాన్ సెన్సార్ బోర్డు ద‌గ్గ‌ర జ‌రిగింది ఈ కోత‌ల వ్య‌వ‌హారం. ఈ కాంట్ర‌వ‌ర్శ‌ల్ మూవీని ముందు అస‌లు పాకిస్థాన్ లో రిలీజ్ చేయ‌నేకూడ‌ద‌ని అనుకున్నారు. ఓ ద‌శ‌లో నిషేధానికి స‌న్నాహాలు కూడా జ‌రిగాయి. ఐతే త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్నారు. ఐదుగురు స‌భ్యుల క‌మిటీ ప్ర‌త్యేకంగా ఈ చిత్రాన్ని వీక్షించి 100కు పైగా క‌ట్స్ సూచించింది. డిస్ట్రిబ్యూట‌ర్ ఈ క‌ట్స్ కు అంగీక‌రించ‌డంతో ఈ వారాంతంలో ‘ఉడ్తా పంజాబ్‌’ను అక్క‌డ రిలీజ్ చేస్తున్నారు.

సినిమాలోని బూతు మాట‌ల‌న్నింటికీ కోత వేసేసింద‌ట పాక్ సెన్సార్ బోర్డు. అలాగే యాంటి పాకిస్థాన్ డైలాగుల్ని కూడా తొల‌గించిన‌ట్లు స‌మాచారం. ఈ మ‌ధ్య బాలీవుడ్ సినిమాల‌కు పాకిస్థాన్ లో క్ర‌మంగా మార్కెట్ పెరుగుతోంది. ‘భ‌జ‌రంగి భాయిజాన్’ లాంటి సినిమాలు అక్క‌డ ఇర‌గాడేశాయి. ‘ఉడ్తా పంజాబ్’ మీద నెల‌కొన్న వివాదం నేప‌థ్యంలో ఆ సినిమా మీద కూడా అక్క‌డ ఆస‌క్తి బాగానే ఉంది. ఐతే ఏకంగా వంద క‌ట్స్ అంటే ఇక సినిమా ఏం మిగిలుతుంద‌నేది డౌటు. కంటిన్యుటీ దెబ్బ తినొచ్చు. ప‌దే ప‌దే బీప్ పౌండ్.. మ్యూట్ వ‌స్తుంటే ప్రేక్ష‌కుల‌కు ఇబ్బంది క‌ల‌గొచ్చు. మ‌రి ‘ఉడ్తా పంజాబ్’ పాక్ ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతినిస్తుందో చూడాలి.
Tags:    

Similar News