తెలుగు సినిమా వైపు ప్రపంచం మొత్తం తొంగి చూసేలా చేసిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీ వరల్డ్ వైడ్‌గా ఓ రేంజ్‌లో ప్రభావాన్ని చూపించి కోట్ల రూపాయలను కొల్లగొట్టేసింది. అలా సంచలన విజయాన్ని సాధించడంతో పాటు తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది.
టాలీవుడ్‌లోని ఇద్దరు బడా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన RRR మూవీలోని 'నాటు నాటు' పాట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఊరమాస్‌గా మారిపోయి స్టెప్పులు వేసుకునేలా ప్రభావాన్ని కూడా చూపించింది.
అలా ప్రతి ఒక్కరి సెలెబ్రేషన్స్‌లో ఈ సాంగ్ ఓ పార్టుగా మారిపోయింది. అందుకే ఈ నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సొంతం అయింది.
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులే అవుతోన్నా.. దీని ప్రభావం మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా 'నాటు నాటు' పాట ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో మారుమ్రోగిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్ దేశంలోని ఆర్మీ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీసేశారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.
ఉక్రెయిన్ దేశానికి చెందిన ఆర్మీ అఫీషియల్స్ డ్రోన్ల సహాయంతో ఓ ప్రయోగాన్ని చేశారు. దీనికి RRR మూవీలోని నాటు నాటు పాటను వాడుకున్నారు. ఈ సాంగ్‌కు వాళ్లంతా డ్యాన్స్ చేస్తూ రిమోట్లతో డ్రోన్లను ప్రయోగించారు. ఇందులో మగవారితో పాటు లేడీస్ కూడా పాల్గొన్నారు. ఈ వీడియోను ఆ దేశ ప్రముఖులు ట్వీట్ చేశారు. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.
ఇదిలా ఉండగా.. RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి సంబంధించిన చాలా వరకు షూటింగ్‌ను ఉక్రెయిన్‌లో షూట్ చేశారు. ఆ సమయంలో అక్కడి సైన్యంతో ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో సన్నిహితంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని చాలా మంది ఆర్మీ సభ్యులు స్వయంగా వెల్లడించారు. అందుకే కొందరు సైనికులకు రామ్ చరణ్ సహాయం కూడా చేసిన విషయం తెలిసిందే.