సెన్సార్ బోర్డ్ నుంచి ఎదురైన ఎన్నో వేధింపులను అధిగమించి.. ఎట్టకేలకు ఏ సర్టిఫికేట్ సంపాదించిన ఉడ్తా పంజాబ్ మూవీ.. మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధమైంది. 89 కట్స్ ను సీబీఎఫ్సీ సూచిస్తే.. కోర్టుకు వెళ్లి కేవలం ఒకే ఒక్క కట్ తో విడుదలకు అనుమతి పొందాడు నిర్మాత అనురాగ్ కశ్యప్. అయితే.. ఇప్పుడీ సినిమాకు కొత్త కష్టం వచ్చింది.
గత కొంతకాలంగా అన్ని ఇండస్ట్రీలను వేధిస్తున్న పైరసీ సమస్య.. ఇప్పుడు ఉడ్తా పంజాబ్ కు శాపంగా మారిందని అంటున్నారు. మొత్తం ఈ సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు కాగా.. డౌన్ లోడింగ్ వెబ్ సైట్లలో 40 నిమిషాల కంటెంట్ అందుబాటులోకి రావడంతో.. అందరూ అవాక్కయ్యే పరిస్థితి. దీంతో ఆయా సర్వర్ల నిర్వాహకులను కాంటాక్ట్ చేసి.. హుటాహుటిన ఆ వీడియోలను బ్లాక్ చేయించారు నిర్మాతలు.
అయితే కథ ఇక్కడితో అయిపోలేదనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మూవీ అంతా ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది. సెన్సార్ కాపీ కావడంతో.. మూవీ రన్ అవుతున్నంత సేపు రన్నింగ్ టైం కూడా డిస్ ప్లే అవుతుంది. మూవీకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను చూస్తే... ఫస్ట్ ఫ్రేం నుంచి లాస్ట్ షాట్ వరకూ కంప్లీట్ గా లీక్ అయిందనే వాదనకు బలం చేకూరుతోంది. కోర్టులో కేసు ఓడిపోవడంతో... ఇదంతా సెన్సార్ బోర్డ్ నుంచే జరిగిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.