సూపర్ స్టార్ మహేష్ తో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ `జనగణమన` చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావించారు. కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎందుకో ఇద్దరి మధ్య సింక్ కుదర్లేదు. మహేష్ స్టార్ డమ్ కావొచ్చు..పూరి పరాజయాలు వెనక్కి లాగిపెట్టి ఉండొచ్చు..లేక ఇతర అంశాలేవైనా రీజన్స్ అయిండొచ్చు. దీంతో మహేష్ అనే ఆలోచనని పూరి పూర్తిగా తొలగించి ఆ ప్రాజెక్ట్ లోకి రౌడీబోయ్ విజయ్ దేవరకొండని తీసుకొచ్చారు. మహేష్ తో కాదు..విజయ్ తో కొట్టి చూపిస్తానన్న కసితో పూరి పనిచస్తున్నారు. ఇప్పటికే విజయ్ కి ఫైనల్ వెర్షన్ స్ర్కిప్ట్ కూడా వినిపించి లాక్ చేసారు.
`లైగర్` తో పూరి-విజయ్ పాలు నీళ్లలా కలిసిపోవడం `జనగణమన`కి కలిసొచ్చింది. విజయ్ పాన్ ఇండియా ఇమేజ్..పూరి ట్యాలెంట్ కలిస్తే మరో సూపర్ స్టార్ ని ఎందుకు రెడీ చేయాలేనిన పూరి విజయ్ తోనే బరిలోకి దిగుతున్నారు. `లైగర్` చిత్రీకరణ సమయంలో విజయ్ ని పూర్తిగా స్టడీ చేసారు పూరి. `జనగణమన`కి బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వగల స్టార్ అని డిసైడ్ రంగంలోకి దిగుతున్నారు. ఈ చిత్రాన్ని పూరినే స్వయంగా నిర్మిస్తున్నారు. అయితే పూరి కేటాయించిన బడ్జెట్ సరిపోదు. అంతకు మించి బడ్జెట్ పెట్టి తీయాల్సిన కధ. విజువల్ గానూ అద్భుతంగా హైలైట్ చేయాలి.
అందుకే ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ని కూడా భాగం చేస్తున్నారు. వీటన్నింటికి మించి విజయ్ ఇప్పటివరకూ భారీ బడ్జెట్ చిత్రాలేవి చేయలేదు. విజయ్ ఇమేజ్ ని బట్టి పరిమిత బడ్జెట్ లోనే నిర్మాణం జరిగింది. వాటి పలితాలు నిర్మాతల పాలిట కోట్ల కనక వర్షం కురిపించాయి. ఆ రకంగా విజయ్ క్రేజ్ ని వాడుకుని నిర్మాతలు లాభపడ్డారు తప్ప! విజయ్ ఇమేజ్ ని మించి ఖర్చు చేయలేదు. అయితే ఇప్పుడా అంశాన్ని పూరి `జనగణమన` తో బ్రేక్ చేస్తున్నట్లు ముంబై సోర్సెస్ చెబుతున్నాయి. స్కిప్ట్ సహా విజయ్ ఇమేజ్ ని అమాంతం పెంచేలా భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నట్లు టాక్ వనిపిస్తోంది.
సాధారణంగా పూరి ఓవర్ బడ్జెట్ స్ర్కిప్ట్ లు ఎప్పుడూ సిద్దం చేయరు. సెట్స్ కూడా పెద్దగా ఉండవు. నేచురల్ లొకేషన్స్ లోనే షూట్ చేస్తారు. కేవలం అవసరం మేర పాటలకు మాత్రమే సెట్స్ వేస్తారు. కానీ `జనగణమన` విషయంలో మాత్రం వాటిని ఓవర్ కమ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ విషయంలో పూరి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా స్ర్కిప్డ్ సిద్దం చేయడానికి కూడా పూరి కొన్ని నెలలు పాటు కేటాయించారు. ఏప్రిల్ లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం.
ఇటీవలే `లైగర్` చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పూరి అండ్ టీమ్ ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. సమ్మర్ కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ కూడా చాలా కీలకం. ఈ సినిమా ఫలితం జనగణమనకి చాలా కీలకం. కొత్త ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచాలన్నా? తగ్గించాలన్నా లైగర్ సీక్సెస్ కీరోల్ పోషిస్తుంది.