గాళ్ ఫ్రెండ్ ని చూపించిన గ్యారేజ్ విలన్

Update: 2016-09-14 05:33 GMT
జనతా గ్యారేజ్ మూవీతో యంగ్ విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు ఉన్ని ముకుందన్. మల్లూవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోకి.. యంగ్ టైగర్ తో జనతా గ్యారేజ్ చేసిన తర్వాత ఇప్పుడు టాలీవుడ్ లోనూ అభిమానులు పెరిగారు. కేరళలో అయితే.. ఈ కుర్ర హీరోకి యూత్ లో ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్లందరికీ షాక్ ఇస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు ఉన్ని ముకుందన్.

'నా ఆస్ట్రేలియన్ గాళ్ ఫ్రెండ్' అంటూ ఓ క్యాప్షన్ తగిలించి మరీ.. ఉన్ని ముకుందన్ వీడియో పోస్ట్ చేయడంతో.. చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే.. వీడియో ఓపెన్ చేశాక అసలు విషయం అందరికీ అర్ధమైంది. ఆ వీడియోలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వైట్ కొకాటూ(రామ చిలక) కనిపిస్తుంది. దానితో ఆడుకుంటూ కనిపిస్తాడు ఉన్ని. అయితే.. ఈ మధ్య ఇతడి అఫర్లపై మల్లూవుడ్ లో గాసిప్ లు బాగానే పెరిగాయి.

ఒరు మురాయ్ వంతు పార్తాయ చిత్రంలో.. తనతో కలిసి నటించ సనూషాతో ఉన్ని ముకుందన్ ప్రేమలో పడ్డాడని.. త్వరలో పెళ్లి కూడా చేసేసుకోబోతున్నాడనే టాక్ వచ్చింది. వీళ్లద్దరు కొంత సన్నిహితంగా ఉన్న ఫోటో బైటకు రావడమే ఇందుకు కారణం. అయితే.. ఈ వార్తలను ఖండించిన ఉన్న ముకుందన్.. అలాంటివేమీ లేవని తేల్చేశాడు. ఇలాంటి గాసిప్ లను ఎంటర్టెయిన్ చెయ్యద్దని ఓ క్లాస్ కూడా ఇచ్చాడు లెండి.
Full View

Tags:    

Similar News