కష్టపడలేదంటున్న మల్లూ ఆర్టిస్ట్!!

Update: 2016-07-22 17:30 GMT
మళయాళ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఉన్నిముకుందన్.. తెలుగులో అరంగేట్రం చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్టు జనతా గ్యారేజ్ తో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశిస్తున్నాడు.

తొలి సినిమా రిలీజ్ కాకుండానే రెండో మూవీ ఆఫర్ కూడా దక్కించుకుని ఉన్ని ముకుందన్ సంచలనం సృష్టించాడు. రీసెంట్ గా జనతా గ్యారేజ్ కి డబ్బింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసేసిన ఈ ఆర్టిస్ట్.. తెలుగు పెద్దగా కష్టం అనిపించలేదని అంటున్నాడు. 'నాకోసం డైలాగ్స్ ని ఇంగ్లీష్ లో రాసిచ్చారు. రికార్డింగ్ కి ముందే నేను బాగా ప్రాక్టీస్ చేశాను. నేను వాటి భావాలను ఎంత చక్కగా పలికానంటే నాకు అసలు తెలుగు డబ్బింగ్ చెప్పడం కష్టం అనిపించలేదు. తెలుగు మాట్లాడే వ్యక్తి మాటల మాదిరిగానే ఇవి వినిపిస్తాయి' అని చెప్పాడు ఉన్ని ముకుందన్. ఈ మల్టూ ఆర్టిస్ట్ కి టాలీవుడ్ మరిన్ని ఆఫర్స్ ఇస్తోంది.

 ఆగస్ట్ 14 నుంచి అనుష్క నటిస్తున్న భాగమతి షూటింగ్ లో భాగం కానున్నాడు ఉన్ని ముకుందన్. ఈ సినిమా కూడా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని.. ఇందులో తన పాత్ర చాలా పాజిటివ్ గా ఉంటుందని ఉన్నిముకుందన్ చెప్పాడు.
Tags:    

Similar News