సింహానికి ఎదురుగా వచ్చావో.. నామరూపాలుండవ్! అంటూ పంచ్ విసురుతాడు ఓ సినిమాలో హీరో. సింహానికి ఎదురు రావడమేం కర్మ. ఏకంగా సింహాలనే ఆడుకుంటున్నారు ఈ డేరింగ్ లేడీ. ఇంతకీ ఎవరావిడ? అంటే.. మెగా కోడల్ ఉపాసన డేరింగ్ ఫీట్ గురించే!.. వామ్మో ఏంటిలా సింహాలతోనే చెలగాటమా? అని షాక్ తినకుండా ఉండలేరు. ఇదిగో ఈఫోటోలో ఉపాసన రామ్ చరణ్ సాహసాలు చూశారా? అక్కడ కొన్ని సింహం పిల్లలతో ఎలాంటి భయం లేకుండా ఎలా ఆడుకుంటున్నారో. కామినేని డాటర్ కం మెగా కోడలు లో ఇన్ని గట్స్ ఉన్నాయా?
వైల్డ్ లైఫ్ లో ఎంటరవ్వడమే గాక.. అక్కడ ఏకంగా సింహాలనే ఆడేసుకుంటున్నారు. ఆ ధైర్యానికి మెచ్చుకుని తీరాలి. ఆసక్తికరంగా ఆ రెండు సింహం పిల్లలు ఉపాసనతో అంతే జోవియల్ గా కలిసిపోయి ఆటాపాటతో బిజీ అయిపోయాయి. ఇలాంటి సెన్సిటివ్ మూవ్ మెంట్ ని కెమెరాలో అద్భుతంగా కాప్చుర్ చేశారు. అన్నట్టు ఈ ఫోటో తీసినది ఎవరు? అంటే ఉపాసనతో పాటు వైల్డ్ లైఫ్ విహారంలో ఉన్న రామ్ చరణ్ అని అర్థమవుతూనే ఉంది.
ఈ ఏడాది రామ్ చరణ్ - ఉపాసన జంట ఏడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా సెలబ్రేషన్ ని ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ప్రతి సంవత్సరం లానే ఈసారి కూడా కొత్తగానే ప్లాన్ చేశారు. ``ఇప్పుడైనా తెలిసిందా అసలు నేను మిస్టర్ సిని ఎందుకు పెళ్లాడానో! ఆఫ్రికా ట్రిప్ చాలా పాఠాలు నేర్పించింది. అమ్మ లాంటి ప్రకృతి మనమంతా గౌరవించాలి. వైల్డ్ లైఫ్ ను చూసి ఎంతో నేర్చుకోవాలి. ప్రకృతిని.. జంతువుల్ని ప్రేమించి గౌరవించాలి. జంతువుల జీవనాన్ని అర్థం చేసుకోవాలి. అనుసరించాలి..`` అంటూ ఉపాసన ఈ ఫోటోకి వ్యాఖ్యను జోడించారు.