ఉపాసన కొణిదెల ...ఈ పేరు ఇప్పుడు ఒక సంచలనం. మెగాకోడలుగా ఉపాసన లైఫ్ స్టైల్ గురించి అందరికి తెలుసు. అపోలో లైఫ్-అపోలో ఫౌండేషన్ అధినేతగా అభిమానులకు నిరంతరం యూట్యూబ్ వేదికగా అవేర్ నెస్ పెంచుతున్నారు. ఈ వేదికపై ఫిట్ నెస్ సలహాలు ఇస్తూ బోలెడంత ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అలాగే భర్త రామ్ చరణ్ సినిమాలకి సంబంధించిన న్యూస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ మెగా అభిమానులకి దగ్గరైంది మెగా కోడలు. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇప్పటికే లక్షల్లో అభిమానులు ఉపాసనను అనుసరిస్తుండడం విశేషం.
అలాగే , హైదరాబాద్ లో ఉన్న బెస్ట్ మహిళా ఎంటర్ ప్రెన్యూర్స్లో ఒకరిగా ఉపాసన గౌరవం అందుకుంటున్నారు. ఇంతకుముందు పలు గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాలు.. పారిశ్రామిక వేత్తల సమావేశాల్లో అద్భుతమైన స్పీచ్ లతో ఆమె ఆకట్టుకున్నారు. పలు అంతర్జాతీయ వేదికలపైనా ఉపాసన గౌరవం అందుకున్నారు. ప్రతి విషయంపై తనదైన శైలిలో స్పందిస్తూ ..ప్రజలని చైతన్య పరుస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ థ్రోబ్యాక్ ఫోటోని అభిమానులకు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
ఈ పోస్ట్ మీలో స్ఫూర్తి నింపుతుంది. గుడ్ టైమ్ కోసం వేచి చూడాలి. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ ప్రశాంత చిత్తాన్ని కలిగి ఉండాలి. భవిష్యత్ కోసం పాజిటివ్‌గా వేచి చూడాలి అంటూ చక్కని సందేశాన్ని ఇచ్చారు. కరోనా కల్లోలం నేపథ్యంలో ఇలాంటి పాజిటివ్ సూచనలు చేయడం సామాన్యుల్లో ధైర్యాన్ని నింపడం ఆహ్వానించదగినదే. దీనిపై మెగా అభిమానులు ..ఉపాసన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.