మెగా కోడ‌లు అన్ కండిష‌న‌ల్ ల‌వ్?

Update: 2019-03-13 07:45 GMT
మెగా కోడ‌లు ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ సామాజిక మాధ్య‌మాల్లో నిరంత‌రం అభిమానుల‌కు వినోదం కంటే విజ్ఞానం పంచేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. ఇక రామ్ చ‌ర‌ణ్ సినిమాల సంగ‌తులు స‌హా ఫ్యామిలీ విష‌యాల్ని ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా వంటి చోట్ల షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా చెర్రీ అభిమానుల‌కు, ఫిట్నెస్ ఫ్రీక్స్ కి ఉపాస‌న ట్వీట్స్ ఎంతో చేరువగా నిలుస్తుంటాయి. అపోలో ఫౌండేషన్ అధ్య‌క్షురాలిగా ఉపాస‌న ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాల‌తో పాటు భ‌క్తి, ధార్మిక‌త‌లోనూ త‌న‌కు ఉన్న ఆస‌క్తుల్ని సామాజిక మాధ్య‌మాల్లో రివీల్ చేస్తూనే ఉన్నారు.

ఇక మెగా కోడ‌లు కూల్ గా రిలాక్స్ డ్ మోడ్ లో ఉంటే జిమ్, హెల్త్ అంటూ చాలా సంగ‌తులు చెబుతారు. ప్రొఫెష‌న‌ల్ గా ఉంటే ఇదిగో ఇలా  ప్ర‌మోష‌న్స్ లోనూ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. పెర్ఫెక్ష‌న్ కోసం క‌స్ట‌మైజ్డ్ అని చెబుతున్న ఉపాస‌న .. అన్ కండిష‌న‌ల్ ల‌వ్! అంటూ ఆ ప‌ప్పీతో క‌లిసి ఇచ్చిన ఫోజు ప్ర‌స్తుతం అభిమానుల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది. అవ‌ర్ బేబి అంటూ క్యూట్ ప‌ప్పీని ఉపాస‌న తెగ ముద్దాడేస్తున్నారు. ఇంత‌కీ విష‌యం ఏమిటి? అంటే ఓ సంగ‌తి క్లియ‌ర్ క‌ట్ గా అర్థ‌మ‌వుతోంది.

ఇన్నాళ్లు రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌కు ప్ర‌మోష‌న్ చేసి ఆర్జించేవారు. ఇప్పుడు అదే త‌ర‌హా ఎర్నింగ్ రేస్ లోకి ఉపాస‌న కూడా వ‌చ్చి చేరారు. ఇక‌పై ఉపాస‌న ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌కు త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేయ‌నున్నార‌ని తాజా ట్వీట్ చెబుతోంది. ఇందులో లూయీస్ ఊట‌న్ డిజైన‌ర్ బ్రాండ్ ఉంది. త‌న‌కోసం ఓ టీమ్ ప్ర‌త్యేకించి మేక‌ప్ వ‌గైరా డిజైన్ చేశార‌ట‌. శాండీ శాస్త్రి, జాక్ ర‌సెల్ అంటూ డిజైన‌ర్ టీమ్ పేర్లు వ‌రివీల్ చేసింది. లూయిస్ ఊట‌న్ డిజైన‌ర్ లెద‌ర్ బ్యాగులు, డ్రెస్ లు వ‌గైరా వాటికి ఉపాస‌న ప్ర‌చారం చేస్తున్నార‌న్న‌మాట‌. గ‌త కొంత‌కాలంగా ఉపాస‌న ఎంతో శ్ర‌మించి రూపురేఖ‌ల్ని ట్రిమ్ చేసిన సంగ‌తి తెలిసిందే. భ‌విష్య‌త్ ప్రణాళిక‌లకు సంబంధించి ఉపాస‌న ర‌క‌ర‌కాలుగా సామాజిక మాధ్య‌మాల్లో లీక్స్ అందిస్తున్నారు. అయితే ఉపాస‌న - రామ్ చ‌ర‌ణ్ జంట కొత్త ఇంట్లోకి ఎప్పుడు దిగుతున్నారో మాత్రం చెప్ప‌లేదింకా!!

Tags:    

Similar News