సమ్మర్‌ సినిమాల విడుదల విషయంలో క్లారిటీ

Update: 2020-03-26 03:30 GMT
ఈ కరోనా ప్రభావం లేకుంటే నేటి నుండి టాలీవుడ్‌ లో సమ్మర్‌ సినిమాల హడావుడి మొదలయ్యేది. నేడు ఉగాది కానుకగా పలు చిత్రాలు విడుదల తేదీని ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ అవ్వడంతో మొత్తం సినిమాల విడుదల క్యాన్సిల్‌ అయ్యాయి. ఏప్రిల్‌ 1 నుండి మళ్లీ థియేటర్లు ఓపెన్‌ అవుతాయని అనుకున్నారు. కాని నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని లాక్‌ డౌన్‌ చేస్తూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 వరకు మళ్లీ సినిమా విడుదల వాయిదాలు పడబోతున్నాయి.

ఆ తర్వాత కూడా వెంటనే సినిమాల విడుదల ఉంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. మొత్తానికి ఏప్రిల్‌ చివరి వారంలో థియేటర్లు మళ్లీ కళకళలాడే అవకాశం ఉందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌ చివరి వారం నుండి సినిమాల విడుదల మొదలు పెట్టాలని టాలీవుడ్‌ కు చెందిన కొందరు నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే సినిమాల విడుదల తేదీలు ప్రకటించుకుని వాయిదా పడ్డాయి. ఆ క్రమంలోనే ఏప్రిల్‌ చివరి వారం నుండి సినిమాలను విడుదల చేసుకోవాలనే ఒప్పందంకు వచ్చారట.

నిర్మాతలు ఇంకా ఫిల్మ్‌ మేకర్స్‌ ఈ విషయంలో ఫుల్‌ క్లారిటీతో ఉన్నట్లుగా చెబుతున్నారు. వారంకు రెండు మూడు సినిమాల చొప్పున విడుదల చేస్తూ అందరికి న్యాయం జరిగేలా ముందుకు వెళ్లాలని నిర్మాతల మండలి పెద్దలు నిర్ణయించుకున్నట్లుగా తొస్తోంది. సినిమాల విడుదల విషయంలో నిర్మాతల మండలి జోక్యం చేసుకోవాలని కొందరు భావిస్తున్నారు. థియేటర్లు రీ ఓపెన్‌ అయిన వెంటనే ఆర్డర్‌ ప్రకారంగా సినిమాల విడుదల ఉండబోతున్నాయి. అంటే ఉగాదికి రావాల్సిన సినిమాలు మొదటగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News