యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన 'ట్రిపుల్ ఆర్' తో పాన్ ఇండియా హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే. అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ పలు దఫాలుగా కరోనా కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకలు ముందుకొచ్చింది. ఊహించిన విధంగానే భారీ విజయాన్ని అందించిన పాన్ ఇండియా వైడ్ గా చరణ్, ఎన్టీఆర్ లకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఈ మూవీ తరువాత చరణ్ తన 15 వ సినిమాకు వెళ్లిపోయాడు. ఎన్టీఆర్ తన 30 వ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్టర్ కొనటాల శివతో చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక మే 20న తన పుట్టిన రోజు సందర్భంగా కొరటాల తో చేయబోతున్న మూవీకి సంబంధించిన డైలాగ్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. ఐదు భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నామంటూ డైలాగ్ మోషన్ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు.
హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరపైకి రానున్నీ మూవీని జూలై లేదా ఆగస్టులో సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కూడా ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేసథ్యంలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి తాజాగా బయటికి వచ్చి ఆసక్తిని రేకెత్తిస్తోంది. యంగ్ టైగర్ సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రత్యేకంగా వుంటుందన్నది తెలిసిందే.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కొరటాల శివ తాజా సినిమా కోసం ఓ టెర్రిఫిక్ ఇంటర్వెల్ బ్యాంగ్ ని ప్లాన్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం భారీ సెట్ ని నిర్మిస్తున్నారట. ఇందులో చిత్రీకరించే భారీ హైవోల్టేజ్ యాక్షన్ ఘట్టాలు రోమాంచితంగా వుంటాయని, ఈ సెట్ లో జరిగే బ్లాస్ట్ లు సినిమాకు హైలైట్ గా నిలుస్తామని, థియేటర్లలో ఫ్యాన్స్ ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ కి పూనకాలు రావడగం ఖాయమని చెబుతున్నారు.
అంతే కాకుండా ఈ సీన్ లో ఎన్టీఆర్ కనిపించే తీరు ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసేలా వుంటుందని, ఈ స్థాయిలో ఎన్టీఆర్ ని ఇంత వరకు ఏ సినిమాలో చూసి వుండరని చెబుతున్నారు.
ఈ మూవీ కోసం హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా వరకు బరువు తగ్గుతున్నారట. 8 నుంచి 9 కేజీల వరకు బరువు తగ్గుతున్నారని, ముందు అనుకున్న జూలైలో కాకుండా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ఆగస్టు నుంచి ప్రారంభించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి ఫొటోగ్రఫీ రత్నవేలు , ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటింగ్ శ్రీకర ప్రసాద్ అందిస్తుండగా ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మించనున్నారు.