బాలయ్యతో రావిపూడి జెట్ స్పీడ్ టార్గెట్!

Update: 2022-10-06 06:25 GMT
నందమూరి బాలకృష్ణ ఆరుపదుల వయసులోకి వచ్చినా కూడా ఇంకా ఏమాత్రం స్లో కావడం లేదు. ఆయన వయసు పెరుగుతున్న కొద్ది వేగం కూడా ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు టాక్ షో తో కూడా బిజీ అవుతూ ఉండడం విశేషం. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది.

మరి కొన్ని కీలకమైన సన్నివేశాలు పూర్తి చేస్తే 107వ ప్రాజెక్ట్ కు గుమ్మడికాయ కొట్టేస్తారు. ఇక ప్రాజెక్టుకు సంబంధించిన కీలక షెడ్యూల్ ఇటీవల పూర్తయిన వెంటనే బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షోను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అప్పుడే ప్రమోషన్స్ హడావిడి కూడా మొదలైపోయింది. ఇక త్వరలోనే ఆ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ కూడా మొదలు కాబోతోంది.

అయితే ఈ ప్రాజెక్టులతో బిజీగా ఉండగానే బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మరొక కొత్త సినిమాను మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దర్శకుడు అనిల్ బాలయ్య బాబు కోసం పూర్తిస్థాయిలో కథను మొత్తం సిద్ధం చేశాడు.

మళ్ళీ మధ్యలో ఎలాంటి ఇబ్బంది రాకుండా పక్క ప్రణాళికతోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేయబోతున్నారు. ఒక విధంగా ఇటీవల కాలంలో బాలయ్య బాబు అంత వేగంగా ఏ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనంత స్పీడులో అనిల్ రావిపూడి ప్రాజెక్టును ఫినిష్ చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య బాబు 108 వ ప్రాజెక్టుగా తెరపైకి రాబోతున్న  ఈ సినిమా టైటిల్ కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూట్ నవంబర్లో మొదలుపెట్టబోతున్నారు.

ఇక కేవలం నాలుగు నెలల్లోనే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా ప్లాన్ అయితే చేసుకుంటున్నారు. ఇక ఏప్రిల్ లేదా మే నెలలో సినిమాను విడుదల చేయాలని కూడా ఒక టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News