కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన సంచలన సినిమా 'కేజీఎఫ్ 2'. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో స్వాతంత్య్రానంతరం జరిగిన ఆసక్తికర కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. కేజీఎఫ్ ప్రపంచం చుట్టూ అళ్లుకున్న కథగా తెరకెక్కిన ఈ మూవీ ఊహించని విధంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేసింది.
కేజీఎఫ్ అనే కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ మూవీకి కొనసాగింపుగా చాప్టర్ 3 కూడా రానున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే చియాన్ విక్రమ్ యష్ కేజీఎఫ్ లో అడుగు పెడుతున్నాడు. అయితే ఈ కథ స్వాతంత్య్రానికి ముందు కేజీఎఫ్ చుట్టూ జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతోంది. రీసెంట్ గా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్ 1' ద్వారా ఆదిత్య కరికాలుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విక్రమ్ ఈ మూవీ తరువాత పా. రంజిత్ దర్శకత్వంలో భారీ పీరియాడికల్ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారు.
కె.ఇ. జ్ఞానవేల్ రాజా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. గత రెండు నెలల క్రితం లాంఛనంగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. స్వాతంత్య్రానికి ముందు కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్) లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీని పా. రంజిత్ అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా? అని విక్రమ్ అభిమానులతో పాటు కేజీఎఫ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో విక్రమ్ అభిమానులకు చిత్ర బృందం తాజాగా గుడ్ న్యూస్ ని వెల్లడించింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని అక్టోబర్ 14న శుక్రవారం లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. విక్రమ్ లుక్ కు సంబంధించిన టెస్ట్ ని తాజాగా నిర్వహించారు. 'కేజీఎఫ్'లో యష్ బాకరు గడ్డంతో కనిపించిన విధంగానే పా. రంజిత్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న మూవీలో విక్రమ్ కనిపించనున్నాడు. ఆ కారణంగానే గత కొన్ని రోజులుగా విక్రమ్ బారు గడ్డంతో కనిపిస్తున్నాడు.
ఇక ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా 3డీ ఫార్మాట్ లో తెరపైకి తీసుకురానున్నారట. జీవీ ప్రకాష్ సంగీతం అందించనున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. 19వ శతాబ్దంలో కేజీఎఫ్ లో దళితులపై జరిగిన యాదార్ధ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తమిళ్ తో పాటు హిందీ భాషల్లో తెరపైకి తీసుకురాన్నారట.
ఈ రెండు భాషలతొ పాటు మొత్తం ఐదు భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారట. చియాన్ విక్రమ్ నటిస్తున్న 61 ప్రాజెక్ట్ ఇది. 'కేజీఎఫ్'లో గ్యాంగ్ స్టర్స్ మధ్య సాగితే ఈ మూవీ మాత్రం అనగారిన వర్గాలు, మైన్స్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.