మెగాస్టార్ చిరంజీవికి 'ఆచార్య' రూపంలో కొన్ని నెలల కిందట పెద్ద షాకే తగిలింది. ఆయన కెరీర్లో ఫ్లాపులు, డిజాస్టర్లు లేవని కావు కానీ.. మరీ ఆ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ సినిమా ఇంకోటి కనిపించదు. పెట్టుబడిలో 30 శాతానికి మించి వెనక్కి రాకపోవడంతో పారితోషకాల్లో కొంతమేర వెనక్కి ఇచ్చి వారికి సెటిల్ చేయాల్సిన పరిస్థితిని చిరు-చరణ్ ఎదుర్కొన్నారు.
'ఆచార్య' తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్ 'గాడ్ ఫాదర్' మీద కూడా పడింది. 'ఆచార్య'తో పోలిస్తే దీనికి బిజినెస్ తక్కువ జరిగింది. 'ఆచార్య' థియేట్రికల్ హక్కులను రూ.120 కోట్లకు అమ్మితే.. 'గాడ్ ఫాదర్'కు 30 కోట్ల దాకా తగ్గించాల్సి వచ్చింది.
ఐతే ఆ మేరకు బిజినెస్ తగ్గినా.. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. దీనికి పోటీగా రిలీజైన సినిమాలు చతికిలపడ్డా.. రెండో వారంలో కూడా పెద్దగా పోటీ లేకపోయినా.. సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగానే కనిపిస్తోంది. బయ్యర్లకు ఓ మోస్తరు నష్టాలు తప్పేలా లేవు.
ఐదు రోజుల లాంగ్ వీకెండ్లో 'గాడ్ ఫాదర్' వరల్డ్ వైడ్ రూ.90 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ రూ.60 కోట్లకు పైగానే వచ్చింది. ఈ వసూళ్లను సూపర్ అని చెప్పలేం. అలా అని తక్కువ అని కూడా అనలేం. ఈ సినిమాకు వచ్చిన టాక్.. ది ఘోస్ట్, స్వాతిముత్యం చిత్రాలు పెర్ఫామ్ చేసిన వైనం ప్రకారం చూస్తే వసూళ్లు ఇంకా మెరుగ్గా ఉండాల్సింది.
ఉన్నంతలో పరిస్థితి మెరుగే కాబట్టి మరీ బాధపడాల్సిన పరిస్థితి అయితే లేదు. ఐత వీకెండ్ అయ్యాక సినిమా బలంగా నిలబడలేకపోయింది. సోమవారం వసూళ్లు అనుకున్నదానికంటే డ్రాప్ అయ్యాయి. వరల్డ్ వైడ్ షేర్ రూ.2 కోట్లకు మించలేదు. ఈ స్పీడుతో సినిమా రూ.90 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడం చాలా కష్టంగానే కనిపిస్తోంది.
ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు బరిలో లేకపోయినా.. 'గాడ్ ఫాదర్' ఏమేర ఉపయోగించుకుంటుందన్నది సందేహంగానే ఉంది. వీకెండ్లో వసూళ్లు పుంజుకోవచ్చు కానీ.. వీక్ డేస్‌లో మరీ ఇంత వీక్ అయిపోవడం ఆందోళన కలిగించేదే. పరిస్థితి చూస్తుంటే ఫుల్ రన్లో 15-20 కోట్ల మధ్య నష్టాలు తప్పేలా లేవు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.