కత్తి మహేష్ ఆరోగ్యంపై అప్డేట్ ఇదీ

Update: 2021-06-28 13:30 GMT
వివాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన స్నేహితులు అప్డేట్ ఇస్తున్నారు.

కత్తి మహేష్ కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని.. దీంతో డబ్బుల అవసరం రాలేదని ఆయన స్నేహితుడు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ సిద్ధారెడ్డి తెలిపారు. అయితే కత్తి మహేష్ ఇంకా మూడు వారాల పైనే ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ తర్వాత కూడా రికవరీకి సమయం పడుతుందని అన్నారు.

ఇక కత్తి మహేష్ చికిత్సకు ఆర్థిక సాయం చేయడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉండి ముందుకు రాగా.. ఆయన స్నేహితుడు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ సిద్ధారెడ్డి మాత్రం ఇప్పటిదాకా ఎవరి ఆర్థిక సాయం తీసుకోలేదని తెలిపారు. ‘కత్తి మహేష్ ఆరోగ్యం బాగుపడడం కోసం చాలా మంది సాయం చేయడానికి ముందుకొస్తున్నారని.. అయితే హాస్పిటల్ ఖర్చుల కంటే రాబోయే రోజుల్లో అతడి రీహాబిలిటేషన్ అనేది చాలా ముఖ్యం అని దాని గురించి ఆలోచిస్తున్నట్టుగా చెప్పారు. అప్పటివరకు ఎవరి వద్ద నుంచి ఎటువంటి ఫండ్స్ తీసుకోవడం లేదని తెలిపారు.సోషల్ మీడియాలో ఆర్థిక సాయం చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు అని తెలిపారు.

కత్తి మహేష్ కు సాయం చేయాలనుకునే వారికోసం రేపటి నుంచి ఫండ్ రైజింగ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు వెంకట్ సిద్ధారెడ్డి తెలిపారు. ఈరోజు జరిగే ఆపరేషన్ తో ఆయన ఆరోగ్యం గురించి తెలుస్తుందని.. బయట రూమర్స్ నమ్మవద్దని తెలిపారు. కత్తి మహేష్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తామని తెలిపారు.
Tags:    

Similar News