మ‌రో సారి భ‌య‌పెట్టేందుకు న‌య‌న‌తార రెడీ!

Update: 2022-11-16 07:31 GMT
లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ‌త కొంత కాలంగా విభిన్న‌మైన సినిమాల‌కు త‌మిళంలో కేరాఫ్ అడ్ర‌స్ గా మారుతూ వ‌స్తోంది. క‌థాబ‌ల‌మున్న మ‌హిళా ప్ర‌ధాన సినిమాల్లో న‌టిస్తూ వ‌రుస విజ‌యాల్నిసొంతం చేసుకుంటోంది. దీంతో ప‌లువురు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్స్ న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో స‌రికొత్త సినిమాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. తాజాగా న‌య‌న‌తార మ‌రో థ్రిల్ల‌ర్ తో భ‌య‌పెట్టేందుకు రెడీ అవుతోంది. న‌య‌న‌తార న‌టిస్తున్న లేటెస్ట్ హార‌ర్ థ్రిల్ల‌ర్ 'క‌నెక్ట్‌'.

అశ్విన్ శ‌ర‌వ‌ణన్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. న‌య‌న‌తార‌తో అశ్విన్ కిది రెండ‌వ సినిమా. గ‌తంలో 'మాయ‌' అనే హార‌ర్ థ్రిల్ల‌ర్ చేశాడు. ఇప్ప‌డు ఇది కూడా హార‌ర్ థ్రిల్ల‌రే. పాండ‌మిక్ పీరియ‌డ్ నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుందని తెలుస్తోంది.

రౌడీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. 'కార్తికేయ 2'లో సౌత్ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టిన బాలీవుడ్ ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అనుప‌మ్ ఖేర్‌, స‌త్య‌రాజ్ ఈ మూవీలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఏసు శిలువ‌కు దండం పెడుతున్న న‌య‌న‌తార‌తో పాటు చేతిలో రుద్రాక్ష దండ ప‌ట్టుకుని దేవుడి చిత్ర ప‌టాల‌కు న‌మ‌స్క‌రిస్తున్న మ‌రో పాత్ర‌ని చూపించారు. త‌ల‌కిందులు గా రెండు పాత్ర‌ల‌లో న‌య‌న‌తార నే క‌నిపిస్తోంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో మాయ త‌రహాలో న‌య‌న‌తార ద్విపాత్రాభిన‌యం చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది.  

న‌వంబ‌ర్ 18న శుక్ర‌వారం ఈ మూవీ టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టుగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది. 'వాన‌' హీరో విన‌య్ రాయ్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ భార్య కావ్య రామ్ కుమార్ అశ్విన్ తో క‌లిసి క‌థ‌ని అందించ‌డం విశేషం.  పృథ్వీ చంద్ర శేఖ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా మ‌ణికంఠ‌న్ రామాచారి సినిమాటోగ్ర‌ఫర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

త్వ‌ర‌లోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించ‌నున్నారు. వివాహం త‌రువాత న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో విఘ్నేష్ శివ‌న్ నిర్మించిన తొలి సినిమా కావ‌డంతో త‌మిళంలో ఈ మూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. హార‌ర్ థ్రిల్ల‌ర్ ల‌తో విజ‌యాలు సాధిస్తున్న న‌య‌న‌తార ఈ మూవీతోనూ స‌క్సెస్ ని సొంతం చేసుకోవ‌డం గ్యారెంటీ అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News