నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తదుపరి సినిమా పై ఆయన అభిమానుల్లో మాత్రమే కాకుండా ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రస్తుతం ఎన్ బీ కే 107 సినిమా ను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలోని బాలయ్య లుక్ కు అభిమానులు ఫిదా అయ్యారు.
సినిమా ను దసరాకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అందుకోసం ఆగస్టు వరకు షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టే ఉద్దేశ్యంతో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను చేస్తున్నారట. మొన్నటి వరకు టర్కీ లో కీలక సన్నివేశాలు మరియు పాటల చిత్రీకరణ చేసుకుని వచ్చిన యూనిట్ సభ్యులు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా తదుపరి షెడ్యూల్ కు షిప్ట్ అయ్యారు.
టర్కీ షెడ్యూల్ నుండి కొందరు డైరెక్ట్ గా కర్నూల్ కు వెళ్లారు. అక్కడ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ సెట్స్ వేయడంతో పాటు షూటింగ్ లొకేషన్స్ ను కూడా కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. బాలయ్య మరియు శృతి హాసన్ లు నేడో రేపో కర్నూల్ షెడ్యూల్ లో యూనిట్ సభ్యులతో కలిసి జాయిన్ అవ్వబోతున్నారు.
హీరోగా బాలయ్య ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో కనిపించాడు. అయితే ఈ సినిమా లో మాత్రం ఆరు పదుల వయసు ఉన్న వ్యక్తిగా బాలయ్య కనిపించబోతున్నాడట. రెండు పాత్రల్లో బాలయ్య కనిపించబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య ఈ సినిమా లో మాస్ లుక్ లో కనిపించడంతో పాటు ఆకట్టుకునే క్లాస్ లుక్ లో కూడా మెప్పించబోతున్నాడనే వార్తలు యూనిట్ వర్గాల ద్వారా వస్తున్నాయి. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఆగస్టు లో ముగించే అవకాశాలు ఉన్నాయి.
కర్నూలు షెడ్యూల్ వారం నుండి రెండు వారాల వరకు ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. సినిమా టైటిల్ ను ఇంకా రివీల్ చేయలేదు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించి అదే సమయంలో సినిమా టైటిల్ ను రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి.