యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'RRR'తో ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ ని అందించాడు. అయితే మల్టీస్టార్ తరువాత ఎన్టీఆర్ తన 30వ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి నెలలు గడుస్తున్నా ఈ సినిమా మాత్రం పట్టాలెక్కడం లేదు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎన్టీఆర్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని నిర్మించబోతున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న వేళ ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారి ఫ్యాన్స్ ని తీవ్ర అసహనానికి గురిచేసింది. యువ సుధా ఆర్ట్స్ ట్విట్టర్ పేజీ అంటూ ఓ ఫేక్ ట్వీట్ గత కొన్ని రోజులు క్రితం నెట్టింట వైరల్ కావడం.. అభిమానులు నిజమా అని ఆరాతీయడంతో అంతా పాపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఇలా ఆడుకుంటున్నారేంటీ అని చాలా మంది సింపతీ చూపించారు. అయితే దీనిపై యువ సుధా ఆర్ట్స్ మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.
ఇదిలా వుంటే మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టైలాగ్ మోషన్ పోస్టర్ ని ఐదు భాషల్లో విడుదల చేసిన పాన్ ఇండియా వైడ్ గా హంగామా సృష్టించిన మేకర్స్ గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ పై పెదవి విప్పకపోవడంతో ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్ లని వింటూ ఇన్ని నెలలు సైలెంట్ గా వున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ లోనూ ఈ ప్రాజెక్ట్ పై అసహనం మొదలైనట్టుగా ఇన్ సైడ్ టాక్.
'RRR' తరువాత తనతో సినిమాలు చేయాలని స్టార్ ప్రొడ్యూసర్స్ క్యూ కడుతున్నా వారిని పక్కన పెట్టిన ఎన్టీఆర్ ..స్టార్ డైరెక్టర్ కొరటాల శివకే అధిక ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అయితే కొరటాల శివ మాత్రం ఎంతకు తేల్చడం లేదని ఎన్టీఆర్ లో ఓపిక ఫైనల్ స్టేజ్ కి చేరినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికీ ఫైనల్ డ్రాఫ్ట్ ని సిద్ధం చేయకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ ఓ నిర్ణయానికి వచ్చేశారట. డిసెంబర్ వరకు స్క్రిప్ట్ ని తేల్చేసి పట్టాలెక్కించాలని దర్శకుడు కొరటాల శివకు ఫైనల్ గా ఆల్టిమేటమ్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
'RRR' తరువాత తన స్థాయికి తగ్గ పాన్ ఇండియా మూవీతో రావాలన్న ఆలోచనలో వున్న ఎన్టీఆర్ ఆ కారణం వల్లనే కొరటాలకు ఇన్నాళ్లు అవకాశం ఇచ్చారట. డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్ట్ ని తేల్చేయకపోతే ఇతర దర్శకుల్లో ఎవరు బెస్ట్ స్టోరీలో వస్తే వారికి అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి ఎన్టీఆర్ వచ్చినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఈ ఒత్తడి నుంచి కొరటాల శివ బయటపడి ఎన్టీఆర్ ని మెప్పిస్తాడా? .. లేదా? అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.