NTR 30: రెండు కోణాల్లో ఎన్టీఆర్ క్యారెక్టర్

Update: 2022-11-25 09:30 GMT
జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను మరికొన్ని రోజుల్లో మొదలు పెట్టబోతున్నాడు. దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఇప్పటికే టీమ్ సభ్యులందరినీ కూడా ఫైనల్ చేసేసాడు. ఇటీవల అనిరుద్ రవిచందరన్ తో కూడా మ్యూజిక్ సిటింగ్స్ మొదలయ్యాయి. ఇక త్వరలో మొదటి షెడ్యూల్ మొదలు పెట్టడానికి యూనిట్ సభ్యులు కూడా రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల అంశాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన హీరో పాత్ర గురించి కూడా ఇప్పుడు ఒక విషయం చర్చల్లోకి వస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా పవర్ ఫుల్ గా ఉండబోతుంది అని ఇదివరకే ఒక క్లారిటీ అయితే వచ్చింది.

ఇక కథ విషయంలో కూడా ఈసారి మాస్ ఆడియోన్స్ ను మాత్రమే కాకుండా క్లాస్ ఆడియన్స్ కూడా ఆకట్టుకునే విధంగా కొరటాల శివ స్క్రిప్టు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా అసలు కథలో మొదట హీరో ఒక క్లాస్ పర్సన్ గా కామన్ మ్యాన్ గా నీతి నిజాయితీతో కూడిన వ్యక్తిగా కనిపిస్తాడట. ఇక తర్వాత అతను ఒక లీడర్ గా మారి కొన్ని కార్పోరేట్ సంస్థల అన్యాయాన్ని ఎలా ఎడిరిమాచాడు అనేది హైలెట్ అవుతుందట. ఆ తర్వాత వైలెంట్ గా ఎలా మారాడు అనే పాయింట్ తో కథ కొనసాగుతుందట. అంటే ఊహించని ట్రాన్స్ఫర్మేషన్ తో హీరో క్యారెక్టర్ ను కొరటాల శివ హైలెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

కొంతవరకు క్లాస్ గా సైలెంట్ గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా క్రూరంగా అయిపోతే ఎలా ఉంటుంది అనే ప్రభావాన్ని కూడా సినిమాలో చాలా బలంగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కొరటాల శివ సినిమాలలో హీరోలు చాలా సెటిల్ యాక్టింగ్ తోనే ఎక్కువగా ఆకట్టుకుంటూ వచ్చారు.

పెద్దగా అరిచి హడావిడి చేయకుండా ఉండేలాగా అయినా హీరో పాత్రలను డిజైన్ చేస్తారు. సీన్ లో అవసరమైనప్పుడే వారి మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా చూపిస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ ను మాత్రం రెండు కోణాల్లో ఈసారి హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News