ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ కాన్సాస్ పై పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్-కె' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ని మించి పాన్ వరల్డ్ ని రీచ్ అయ్యేలా ఈ సైన్స్ ఫిక్షన్ ని తీర్చిదిద్దుతున్నట్లు రివీల్ చేయడంతో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దీనిలో భాగంగానే హాలీవుడ్ టెక్నీషియన్లని సైతం రంగంలోకి దించి ప్రాజెక్ట్ని పట్టాలెక్కించారు.
ఆన్ సెట్స్ లో ప్రతీ సన్నివేశాన్ని ఓ శిల్పంలా చిక్కుతున్నారు. క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా.. బడ్జెట్ ని అదే స్థాయిఓ కేటాయించి నిర్మిస్తున్నారు. 'బాహుబలి'..'ఆర్ ఆర్ ఆర్'..'కేజీఎఫ్' లాంటి చిత్రాల్ని కొట్టే రేంజ్ లో 'ప్రాజెక్ట్ -కె' రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శర వేగంగా జరుగుతోంది.
షూట్ లో ప్రభాస్ సహా కీలక నటులంతా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ కోసం టీమ్ ఎంతో శ్రమిస్తుంది. కొద్ది రోజులుగా రేయింబవళ్లు శ్రమిస్తేనే ఇలాంటి షెడ్యూల్ ప్లాన్ చేయగలిగారు. ప్రస్తుతం ఆర్ ఎఫ్ సీలో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. కార్ ఛేజింగ్ సన్నివేశాలు ప్రభాస్ అండ్ టీమ్ పై షూట్ చేస్తున్నారుట.
గంటకి వందల కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే కార్లను ఈ సన్నివేశాల చిత్రీకరణలో వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఆ కార్లలో సకల సౌకర్యాలు కలిగి ఉన్నాయని..ఎంతో విలాసవంతంగా డిజైన్ కనిపిస్తుందని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే మోటార్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా సహకారం నాగ్ అశ్విన్ కోరిన సంగతి తెలిసిందే.
అత్యాధునిక టెక్నాలజీ తమ సినిమాలో వినియోగిస్తున్నట్లు..అందుకోసం మహీంద్రా సహకారం కావాలని ఆ మధ్య నాగ్ అశ్విన్ ట్వీట్ చేసిన నేపథ్యంలో వాటికి బధులుగా తప్పకుండా అంటూ రీట్వీట్ చేసారు ఆనంద్ మహీంద్రా. తాజాగా ఈ షెడ్యూల్ లో మహీంద్రా కార్లని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాల కోసమే కొన్ని కార్లను ప్రత్యేకంగా తయారు చేయించినట్లు..అవసరం మేర విదేశాల నుంచి కొన్నింటిని దిగుమతి చేసినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.
అయితే ఈ సన్నివేశాల చిత్రీకరణ నేపథ్యంలో ఇంత వరకూ ప్రభాస్ పేరు మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా ఎవరెవరు? ఈ సన్నివేశాల షూట్ లో పాల్గొంటున్నారో క్లారిటీ రాలేదు. సినిమాలో బిగ్ బీ అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ నటి దీపికా పదుకొణే హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు..హిందీ భాషల్లో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా 500 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ సోలోగా నిర్మిస్తుంది.