ఎన్నిల‌క ప్ర‌చారంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌!

Update: 2022-12-23 11:34 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఏస్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. RC 15 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇటీవ‌ల న్యూజీలాండ్ లో ఓ యుగ‌ళ‌గీతాన్ని రామ్ చ‌ర‌ణ్‌, కియారాల‌పై పూర్తి చేసిన శంక‌ర్ ఆ త‌రువాత షూటింగ్ కి బ్రేకిచ్చాడు.

ప్ర‌స్తుతం తిరిగి తాజాగా షెడ్యూల్ ని రాజ‌మండ్రిలో మొద‌లు పెట్టారు. రాజ‌మండ్రిలోని గోదావ‌రి ఒడ్డున ఇసుక తిన్నెల‌పై ఓ భారీ ప‌బ్లిక్ మీటింగ్ కి సంబంధించిన సెట్ ని నిర్మించారు. చుట్టూ క‌ర్ర‌ల‌తో ఫెన్షింగ్ ని ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా దాని చుట్టూ భారీ క‌టౌట్ ల‌ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్క రామ్ చ‌ర‌ణ్, శ్రీ‌కాంత్ తో పాటు ప‌లువురు కీల‌క న‌టీన‌టులు పాల్గొన‌గా ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించ‌బోతున్నారు.

చ‌ర‌ణ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఈ సీన్ ని చిత్రీక‌రిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే టీమ్ అంతా అక్క‌డికి చేరుకుంది. ఈ లొకేష‌న్ కి సంబంధించిన వీడియో నెట్టింట లీకై వైర‌ల్ గా మారింది. విష‌యం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్య‌లో అక్క‌డికి చేరుకుని చ‌ర‌ణ్ జిందాబాద్ చ‌ర‌ణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయ‌డంతో అక్క‌డ షూటింగ్ కు అంత‌రాయం క‌లిగేలా క‌నిపిస్తోంది. ఈ వీడియో నెట్టింట లీక్ కాడంతో ఫ్యాన్స్ మేక‌ర్స్ పై మండిప‌డుతున్నార‌ట‌. ఈ ప్రాజెక్ట్ మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఈ మూవీని వ‌రుస లీకులు వెంటాడుతున్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికైనా ఈ లీకుల‌పై మేక‌ర్స్ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఎగా ఫ్యాన్స్ మేక‌ర్ దిల్ రాజుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటూ ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న విష‌యం తెలిసిందే. తండ్రిగా, త‌న‌యుడిగా రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్నారు. ఓ పాత్ర 90 వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగుతుంద‌ని, ఆ నాటి రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అద్దంప‌ట్టేలా రాజ‌కీయ నాయ‌కుడిగా చ‌ర‌ణ్ పాత్ర‌ వుంటుంద‌ని తెలుస్తోంది.  

తాజా లీకుల నేప‌థ్యంలో చిత్ర బృందం సోషల్ మీడియా వేదిక‌గా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. సినిమాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎవ‌రు లీక్ చేసినా, సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసిన క‌ఠిన చర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News