ఆర్‌ఆర్‌ఆర్‌ వర్సెస్‌ కేజీఎఫ్ 2.. ఇంకా తేలని లెక్కలు

Update: 2022-11-29 09:16 GMT
కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమాలకు జనాలు వస్తారా.. ఓటీటీలకు అలవాటు పడ్డ ఇండియన్ సినీ ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపు వస్తారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆర్‌ ఆర్‌ ఆర్‌ మరియు కేజీఎఫ్ 2 సినిమాలతో పాటు మరి కొన్ని సినిమాలు కూడా ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద వందల కోట్ల వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా స్టామినా ను నిరూపించాయి.

భారీ బ్లాక్ బస్టర్‌ సక్సెస్ లు గా నిలిచిన కేజీఎఫ్ 2 మరియు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాల యొక్క కలెక్షన్స్ విషయంలో ఏది టాప్‌.. ఏది తర్వాత అనే విషయమై ఊగిసలాట కొనసాగుతోంది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా గా ఆర్ ఆర్ ఆర్‌ నిలుస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కేజీఎఫ్ 2 సినిమా వెయ్యి కోట్లకు పైగానే రాబట్టింది.

ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద మరియు ఓవరాల్‌ వరల్డ్‌ వైడ్‌ బాక్సాఫీస్ వద్ద కూడా కేజీఎఫ్‌ 2 సినిమా టాప్ లో నిలిచింది. అయితే జపాన్ లో ఇటీవల ఆర్‌ ఆర్‌ ఆర్‌ విడుదల అయ్యి భారీ వసూళ్లు సాధిస్తున్న విషయం తెల్సిందే. అక్కడ జక్కన్న మూవీ రాబడుతున్న వసూళ్లతో మొత్తం లెక్కలు మారిపోయాయి.

ఈ ఏడాది లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా ఆర్ ఆర్‌ ఆర్‌ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్ లో ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదలకు ముందు వరకు కూడా కేజీఎఫ్ 2 నే 2022 లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమా గా ఉంది. కానీ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల వల్ల జక్కన్న మూవీ కి ఆ రికార్డు దక్కింది.

ఇప్పటి వరకు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా 1200 కోట్ల వసూళ్లు నమోదు చేసిందని సమాచారం అందుతోంది. కేజీఎఫ్ 2 మాత్రం 1200 కోట్ల కు కాస్త అటు ఇటుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వల్ప తేడాతోనే నెం.1 స్థానంను ఆర్ ఆర్‌ ఆర్‌ దక్కించుకుంది.

కేజీఎఫ్ 2 సినిమా 1200 కోట్లకు కాస్త తక్కువ అవ్వడంతో రెండవ స్థానంలో నిలిచింది. డిసెంబర్‌ వచ్చేస్తోంది.. ఈ ఏడాది ఇంకా పెద్ద సినిమాలు వచ్చే అవకాశం లేదు.. కనుక 2022 యొక్క లెక్కలు తేలినట్లే అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News