సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ ల కాంబోలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తారీకు సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చిన నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా విడుదల తేదీ గురించి చర్చించుకుంటున్నారు.
మహేష్ బాబు కి ఇది 28వ సినిమా.. ఆ కారణంగా 28వ తారీకును ఎంపిక చేసి ఉంటారా అంటూ కొందరు చర్చించుకుంటూ ఉంటే మరి కొందరు ఏప్రిల్ 28వ తారీకున చాలా గొప్ప సినిమాలు.. అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు వచ్చాయి కనుక ఆ తేదీని దర్శకుడు త్రివిక్రమ్ ఎంపిక చేసి ఉంటాడా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇండియన్ సినీ చరిత్రలో నిలిచి పోయే బాహుబలి 2 సినిమా ఏప్రిల్ 28వ తారీకున విడుదల అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా మాత్రమే కాకుండా ఏప్రిల్ 28వ తారీకున 2006 సంవత్సరంలో సూపర్ స్టార్ నటించిన పోకిరి సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బాహుబలి 2.. పోకిరి సినిమాలు మాత్రమే కాకుండా అన్న గారు ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు.. యమలీల.. ఏయన్నార్ వారి అనార్కలీ ఇంకా కొన్ని ఛారిత్రాత్మక విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు కూడా అదే తేదీన వచ్చాయి. కనుక ఏప్రిల్ 28 అనేది ఎప్పుడు కూడా చాలా స్పెషల్ డేట్. వచ్చే ఏడాది ఆ తేదీని మహేష్ బాబు సినిమా ముందుగానే హైజాక్ చేసింది. కనుక #SSMB28 చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.
మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమా లు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకున్నా కూడా ఆ సినిమాల తాలూకు ఇంపాక్ట్ ఏ స్థాయి లో ఉందో అందరికి తెల్సిందే. అందుకే ఈ సినిమా కు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. మహేష్ బాబు సినిమా ను త్రివిక్రమ్ చేస్తే చూడాలని అభిమానులు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు ఈ సినిమా తో అభిమానుల కోరిక నెరవేరబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28 తేదీ కూడా బాగా సెట్ అయ్యింది. కనుక చరిత్ర నెలకొల్పడమే తరువాయి అంటూ సూపర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.