ఉపేంద్ర కన్నడలో సూపర్ స్టార్. తెలుగులోనూ అతడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మామూలు ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీ జనాల్లోనూ ఉపేంద్రకు ఎంత ఫాలోయింగ్ ఉందనేది ఆదివారం ‘ఉపేంద్ర-2’ ఆడియో ఫంక్షన్లో అందరికీ అర్థమైంది. వేదికెక్కిన ప్రతి ఒక్కరిదీ ఒకటే మాట. ‘ఉపేంద్ర సినిమా చూసి మతిపోయిది. అప్పట్నుంచి ఉపేంద్రకు ఫ్యాన్’ అని. ఇలా వరుసబెట్టి తనను పొగిడేస్తుంటే తెగ సిగ్గు పడిపోయిన ఉప్పి.. ఆ తర్వాత మైకందుకుని చాలా వినమ్రంగా మాట్లాడాడు. అతడి మాటలు వింటే ఎవ్వరికైనా ముచ్చటేస్తుందనే చెప్పాలి. అంత ఒద్దికగా, వినమ్రంగా మాట్లాడాడు ఉప్పి. అతనేమన్నాడో చూద్దాం పదండి.
‘‘ఇందాకట్నుంచి అందరూ నన్ను ఊరికే పొగిడేస్తున్నారు. నిజానికి నాది చాలా చిన్న టాలెంటు. ఇక్కడికి చాలా పెద్ద పెద్దోళ్లొచ్చారు. వాళ్లందరూ ఎక్కడికో వెళ్లిపోయారు. వంద కోట్లను టచ్ చేశారు. అలాంటోళ్లు నాలాంటి చాలా చిన్న టాలెంట్ ఉన్నవాణ్ని పొగడ్డం గొప్ప విషయం. టాలెంట్ ఉండటం కంటే దాన్ని గుర్తుపట్టి ప్రోత్సహించడం గొప్ప విషయం. నల్లమలుపు శ్రీనివాస్ నాతో ‘రా’ సినిమా చేశారు. మళ్లీ ఇప్పుడు ఉపేంద్ర-2ను తెలుగులోకి తెస్తున్నారు. తెలుగులో రిలీజ్ చేద్దామనుకున్నపుడు టైం చాలా తక్కువుంది. కాబట్టి కన్నడలో వచ్చాక కొంచెం లేటుగా తెలుగులో రిలీజ్ చేద్దామనుకున్నా. కానీ బుజ్జి నీకెందుకు నేను చూస్కుంటా అని.. మూణ్నాలుగు రోజుల్లో అన్నీ ఏదేదో చేసేశారు. ఆడియో ఫంక్షన్ కూడా చాలా పెద్దగా ఏర్పాటు చేశారు. నేనాయనకు సారీ చెప్పాలి. కనీసం మంచి ట్రైలర్ చూడా చేసివ్వలేదు. ఈ సినిమా కాన్సెప్ట్ బయటికి రాకూడదని భావించి.. ఏదీ రివీల్ చేయలేదు. కన్నడలో కూడా అంతే. పెద్దగా ప్రమోషన్ కూడా చేయలేదు. కానీ అభిమానులే వాళ్లంతట వాళ్లు ఆడియో ఫంక్షన్ పెట్టేసి ఏదేదో చేసేశారు. ఉపేంద్ర నేను అనే కాన్సెప్ట్ తో తీశాను. ఉపేంద్ర-2 నువ్వు అనే కాన్సెప్ట్ తో ఉంటుంది. మళ్లీ డిఫరెంట్ సినిమా చేశాను. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అని ముగించాడు ఉపేంద్ర.