#బ్లేడ్స్ బేబీ! ఇదేం ఫ్యాష‌న్ బాబోయ్ ఉర్ఫీ!?

Update: 2022-07-14 03:30 GMT
పుర్రెకో బుద్ధి జిహ్వ‌కో రుచి! అన్నారు పెద్ద‌లు. అభిరుచిని బ‌ట్టి  ఫ్యాష‌న్స్ అనుక‌ర‌ణలు మారిపోతుంటాయి. ఈ ట్రెండ్ లో ఫ్యాష‌న్స్ ప‌రంగా ఒక‌రికి న‌చ్చిన‌ది ఇంకొక‌రికి న‌చ్చాల‌ని రూల్ ఏం లేదు. న‌చ్చితే పొగిడేస్తారు.. న‌చ్చ‌క‌పోతే తెగిడేస్తారు.

పొగ‌డ్త‌ల‌తో పాటు ..ఇలాంటి ట్రోలింగ్స్ ఎన్నిటినో ఎదుర్కొంది ఉర్ఫీ జావేద్. స‌ద‌రు బిగ్ బాస్ బ్యూటీకి సోషల్ మీడియాల్లో ఒక రేంజు ఫాలోయింగ్ ఏర్ప‌డింది. నిరంత‌రం ఏదో ఒక వివాదాస్ప‌ద డ్రెస్ తో ప్ర‌త్య‌క్ష‌మై గుబులు రేపుతున్న ఈ బ్యూటీకి ఇన్ స్టా మాధ్య‌మంగా ఒక రేంజు ఫాలోయింగ్ పెరిగింది. దీంతో నిరంత‌రం ఏదో ఒక క్రియేటివ్ లుక్ లో క‌నిపిస్తూ మ‌రింత‌గా ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది.

ఉర్ఫీ జావేద్ తన ఫ్యాషన్ ప్రయోగాలతోనే ఎక్కువ‌మందిని త‌న‌వైపు ఆక‌ర్షిస్తోంది. నిరంత‌రం ఎవ‌రూ ఊహించని ర‌క‌ర‌కాల మెటీరియ‌ల్స్ ..  వస్తువులతో తయారు చేసిన‌ అసాధారణ దుస్తుల‌ను ధ‌రించి వేషధారణలతోనే మైమ‌రిపిస్తోంది. మోడల్ కం న‌టి ఉర్ఫీ మ‌రోసారి అదే త‌ర‌హాలో ప్ర‌కంపనాలు రేపుతోంది. ఈసారి ఉర్ఫీ చాలా స్టైలిష్ గా క‌నిపించినా కానీ ఇది చాలా రిస్కీగా అనిపిస్తోంది.  

దీనిని రిస్కీయెస్ట్ డ్రెస్ అని గుర్తించాలి మ‌రి. ప‌దునైన‌ బ్లేడ్ లతో త‌యారు చేసిన ప్ర‌మాద‌క‌ర‌ దుస్తులు ఇవి. వందలాది బ్లేడ్ లతో తయారు చేసారు. చూడ‌గానే తెగుతుంది అంటూ భ‌యం క‌లుగుతోంది.

ఉర్ఫీ ఈ ఫోటోకి ఆస‌క్తిక‌ర‌ క్యాప్షన్ ఇచ్చింది. ``నేను అంతర్ముఖుల (ఇంట్రావ‌ర్ట్స్- బ‌య‌ట‌ప‌డ‌ని వాళ్లు) కోసం సరైన దుస్తులను తయారు చేసాను. రేజర్ కట్! రేజర్ల నుండి ఈ దుస్తులను తయారు చేసారు! నా పిచ్చి ఆలోచనలను తెలుసుకుని నాకు సహాయం చేసినందుకు నా బృందానికి నేను కృతజ్ఞతలు చెప్పలేను!.. అంటూ ఫ‌న్నీ నోట్ ఇచ్చింది. ఉర్ఫీ ర్యాక్ లో ఇది స్పెషల్ డ్రెస్ అనాలి. నిజంగా అదిరే కిల్లర్ లుక్! అయితే ఇలాంటి దుస్తులు ధరించినప్పుడు కౌగిలింతలు ఇవ్వాలంటే ఎవ‌రికైనా చాలా క‌ష్టం సుమీ!


Full View
Tags:    

Similar News