బన్నీ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'పుష్ప' సినిమాపైనే ఉంది. ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాళ్లంతా కూడా ఆత్రుతను కనబరుస్తున్నారు. కథా పరంగా ఈ సినిమా షూటింగు ఎక్కువగా మారేడుమిల్లి .. రంపచోడవరం ఫారెస్టు ఏరియాలో షూటింగును జరుపుకుంటోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగులో సభ్యుడిగా బన్నీ కనిపించనున్నాడు. ఇక అడవీ ప్రాంతంలోని గిరిజన గూడానికి చెందిన యువతిగా రష్మిక మందన అలరించనుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
సాధారణంగానే సుకుమార్ సినిమాలో ఒక అదిరిపోయే ఐటమ్ ఉంటుంది. ఇక ఈ సారి అడవి నేపథ్యం .. స్మగ్లింగ్ చేసే మాస్ కుర్రాళ్లు దొరికితే ఆయన ఊరుకుంటాడా? అందువలన ఈ సినిమాలోను ఆయన దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి ఒక అదిరిపోయే ఐటమ్ ను సెట్ చేశాడట. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆయన 'ఊర్వశి రౌతేలా'ను ఎంపిక చేయడం విశేషం. ఇప్పటివరకూ బాలీవుడ్ తెరపైనే ఉసిరికాయ ముక్కలా ఊరిస్తూ వస్తున్న ఈ పిల్లను మొత్తానికి తెలుగు తెరకి లాగేశాడు. తెలుగులో ఈ పిల్ల మెరిసే తొలి సినిమా ఇదే. ఈ ఐటమ్ సాంగ్ లో ఈ సుందరి వడ్డించే అందాల కోసం కుర్రాళ్లంతా అరిటాకులు పరుచుకుని కూర్చోవడం ఖాయమని అంటున్నారు.
సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ప్రతి ఐటమ్ సాంగ్ దుమ్మురేపేసింది. మరిచిపోని మంత్రంలా మాస్ కుర్రాళ్లు ఇప్పటికీ ఆ పాటలు పాడుకుంటూనే ఉన్నారు. 'అ అంటే అమలాపురం' .. 'రింగరింగా' .. 'జిగేలురాణి' వంటి ఐటమ్ సాంగ్స్ మామూలు సందడి చేశాయా? అంతకుమించి 'పుష్ప'లోని ఐటమ్ సాంగ్ ఉంటుందని అంటున్నారు. ఓ రాత్రివేళలో స్మగ్లర్లను పోలీసులు చుట్టుముడుతున్నప్పుడు, వాళ్లు ఈ ఐటమ్ సాంగులో మునిగి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఐటమ్ తో ఊర్వశి తన అందాలతో ఊపిరాడనీయకుండా చేయనుందన్న మాట.