ఇటీవలి కాలంలో బాలీవుడ్ కథానాయికల తీరుతెన్నులు వింతగా మారాయి. ఇంతకుముందులా టాలీవుడ్ ఆహ్వానిస్తే అనవసరమైన బెట్టు చేయడం లేదు. వెంటనే ఓకే అనేస్తున్నారు. పారితోషికం కంటే ఇక్కడ నటించేందుకు ప్రాధాన్యనిస్తున్నారు. ఆలియా - దీపిక లాంటి అగ్ర నాయికలు సైతం ఇటీవల తెలుగు సినిమాలకు కమిటయ్యారు. చాలా కాలంగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేయాలనే కుతూహాలంతో ఉంది మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌతేలా.
ఇక్కడ పెద్ద స్టార్ గా ఎదగాలని కలలు కంటోంది. ఎట్టకేలకు తన కలను నెరవేరుస్తూ మెగా బాస్ అవకాశమిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య లో మాస్ సాంగ్ 'బాస్ పార్టీ'తో ఊర్వశి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ పాట ఇప్పటికే రిలీజ్ కాగా సాంగ్ ఆద్యంతం ఈ బ్యూటీ చాలా ప్రత్యేకంగా కనిపించింది.
అందాల ఆరబోతకు ఎంతమాత్రం అడ్డు చెప్పని ఊర్వశి ఐటెమ్ నంబర్ లో హాట్ లుక్స్ తో ఆకర్షిస్తోంది. ఇక బాస్ పార్టీ పాటను తనకు అనువుగా కూడా మలుచుకుంటోంది. ఈ పాట నుంచి రకరకాల వీడియో గ్లింప్స్ ని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ మెగాభిమానుల్ని టెంప్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఊర్వశికి ఇన్ స్టా వేదికగా భారీ ఫాలోయింగ్ పెరగడం చూస్తుంటే ఇదంతా మెగా ఫ్యాన్స్ చలువేనని చెప్పాలి.
ఊర్వశి తనకు అందివచ్చిన అవకాశాన్ని ఉత్తమంగా సద్వినియోగం చేసుకుంటోంది. పాట విడుదలైనప్పటి నుండి ఇన్ స్టాలో ప్రతిరోజూ వీడియో క్లిప్స్ షేర్ చేస్తూ ప్రచారం చేస్తోంది. దాదాపు 6 కోట్ల మంది (59.5 మిలియన్ల) మంది అభిమానులకు వీటిని షేర్ చేస్తూ బోలెడంత ప్రచారం చేస్తోంది.
ఇంతకీ ఈ వీడియోలు అధికారికమా? అంటే కానే కాదు. బాస్ పార్టీపై ఆమె సహాయకులు చిత్రీకరించిన తెరవెనుక వీడియోలను షేర్ చేస్తూ ఊర్వశి గొప్పగా కవ్విస్తోంది. ముఖ్యంగా ఐకానిక్ 'ముఠామెస్త్రి' వీడియో గ్లింప్స్ ని ఊర్వశి షేర్ చేయగా అది అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇది కేవలం లొకేషన్ లో చిత్రీకరించిన వీడియో మాత్రమే. అభిమానులను టెంప్ట్ చేసేందుకు వారితో సన్నిహిత వీడియోలను కూడా పోస్ట్ చేస్తోంది. ఊర్వశి ఏం చేసినా అది వాల్తేరు వీరయ్య ప్రచారానికి కలిసొస్తోంది.
అటు ఉత్తరాదిన భారీ ఫాలోయింగ్ ఉన్న భామ కావడంతో అక్కడా వాల్తేరు వీరయ్యకు ప్రచారం సాగిపోతోంది. ఇక ఈ పాటకు దేవీశ్రీ బాణీ మరీ ఓ రేంజులో క్లిక్ కాలేదు. కానీ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ డ్యాన్సుల్లో గ్రేసు అస్సెట్ కావడంతో అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ఊర్వశి అందచందాలు ఈ పాటకు అదనపు అస్సెట్ అని చెప్పాలి. ఏది ఏమైనా టాలీవుడ్ పై గురి పెట్టి పెద్ద ప్లాన్ తోనే ఉంది ఊర్వశి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.