టాలీవుడ్ టాల్ హ్యాండ్సమ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు 'గౌతమ్ నంద' అనే సినిమా రూపొందింది. ఆ సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించలేక పోయింది. ఆ తర్వాత డైరెక్టర్ సంపత్ నంది నుండి ఏ సినిమా రాలేదు. చాలా గ్యాప్ తీసుకొని ఒక మంచి స్పోర్ట్స్ స్క్రిప్ట్ తో గోపీచంద్ తో రెండో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు 'సీటిమార్' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అదీగాక ఈ సినిమాలో గోపీచంద్ - తమన్నాలు కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారట. మాములుగా సంపత్ నంది సినిమాలలో క్లాస్ అంశాలతో పాటు మాస్ మసాలా అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఈ సినిమా క్రీడా నేపథ్యంలో సాగినా.. సంపత్ సినిమాలలో పాటలు - మాస్ అంశాలు అదిరిపోతాయి. దాదాపు 60% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ నిలిపేయడం జరిగింది. డైరెక్టర్ సంపత్ కి మంచి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉందని ఆయన తీసిన సినిమాల పాటలు వింటే అర్ధమవుతుంది. ప్రతీ సినిమాలో లాగే సీటిమార్ లో కూడా ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసాడట. మంచి మసాలా పాటగా రూపొందించనున్న ఐటమ్ పాటలో బాలీవుడ్ హాట్ క్వీన్ 'ఊర్వశి రౌతేలా' నర్తించబోతుందట. గ్రాండ్ మస్తీ - కాబిల్ - హేట్ స్టోరీలలో హాట్ హాట్ అందాలను ఆరబోసి కుర్రాళ్లలో హీట్ పెంచింది ఊర్వశి. బాలీవుడ్ లో మంచి హాటెస్ట్ గర్ల్ గా పేరొందిన ఊర్వశికి సౌత్ ఇండస్ట్రీలో ఇదే తొలి చిత్రం అవుతుంది. ఈ లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఐటమ్ సాంగ్ షూట్ చేసే సన్నాహాలు చేస్తున్నారట సంపత్ నంది టీమ్. ఊర్వశి గురించి వార్త తెలియగానే తెలుగు కుర్రాళ్లలో ఎక్కడలేని జోష్ మొదలైంది. చూడాలి మరి ఊర్వశితో గోపీచంద్ ఎలా కాలు కదుపుతాడో..