ఐకాన్ స్టార్ గా మారుతున్న ఉస్తాద్ రామ్‌

Update: 2022-03-04 06:30 GMT
ఒక హీరో చేయాల‌నుకున్న సినిమా మ‌రో హీరోకి వ‌రంగా మారిన సంద‌ర్భాలు చాలానే వున్నాయి. `అర్జున్ రెడ్డి` అల్లు అర్జున్‌, శ‌ర్వానంద్ లలో ఓ హీరో చేయాల్సింది. కానీ అది అనూహ్యంగా రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ చేయాల్సి వ‌చ్చింది. ఇలాగే గ‌తంలో సూప‌ర్ స్టార్ కృష్ణ చేయాల్సిన `ఖైదీ` సినిమాని ఆయ‌న కాద‌నిడంతో మెగాస్టార్ చిరంజీవి చేయాల్సి వ‌చ్చింది. `అర్జున్ రెడ్డి` విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని స్టార్ గా మార్చిన‌ట్టే `ఖైదీ` చిరంజీవిని సుప్రీమ్ హీరో అని పిలిచేలా చేసింది. ఇలా చాలా సినిమాలు.. బ్లాక్ బ‌స్ట‌ర్ లు ఇండ‌స్ట్రీ హిట్ లు ఒక హీరో నుంచి మ‌రో హీరోకు వెళ్లాయి.

ఇదే త‌ర‌హాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా ఇప్ప‌డు మ‌రో హీరో వ‌ద్ద‌కు వెళ్లిన‌ట్టుగా తెలుస్తోంది. ఆయ‌నే ఉస్తాద్ రామ్‌. `అల్లు అర్జున్ హీరోగా `ఐకాన్‌` మూవీని ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేశారు. దిల్ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మించాల‌నుకున్నారు. అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించారు కూడా. అయితే ఇది `పుష్ప‌`కు ముందు సినిమా. `పుష్ప‌` రిలీజ్ .. పాన్ ఇండియా రేంజ్ హిట్.. బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేయ‌డం వంటి కార‌ణాల‌తో `ఐకాన్‌` ని చేయ‌డానికి బ‌న్నీ ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ట‌.

పైగా బ‌న్నీ `పుష్ప ది రైజ్‌`ని పూర్తి చేయాలి. ఆ త‌రువాత వ‌రుస క‌మిట్ మెంట్ లున్నాయి. వాటిని ప‌క్క‌న పెట్టి వేణు శ్రీ‌రామ్ `ఐకాన్‌` పై ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ట‌. దీంతో వేణు శ్రీ‌రామ్ మ‌రో హీరోతో `ఐకాన్‌` ని చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇటీవ‌ల `వ‌కీల్ సాబ్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో మాంచి రైజింగ్ లో వున్న వేణు శ్రీ‌రామ్ `ఐకాన్‌` ని హీరో ఉస్తాద్ రామ్‌తో చేయాల‌ని ఇటీవ‌లే ఆయ‌న‌ని క‌లిసిన‌ట్టుగా తెలిసింది. ప్ర‌స్తుతం రామ్ మాస్ యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు లింగుస్వామితో `ది వారియ‌ర్‌` చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

దీని త‌రువాత వెంట‌నే బోయ‌పాటి శ్రీ‌నుతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. ఇటీవ‌లే ఈ ప్రాజెక్ట్ ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు కూడా. దీని త‌రువాత అది కూడా అన్నీ స‌వ్యంగా కుదిరితే `ఐకాన్‌`కి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తార‌ట‌. ప్ర‌స్తుతం టాక్స్ జ‌రుగుతున్నాయి. అన్ని అనుకున్న‌ట్టుగా కుదిరితే ఈ చిత్రాన్ని రామ్ సొంత నిర్మాణ సంస్థ‌, దిల్ రాజు క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తార‌ట‌. `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో మాస్ క‌మ‌ర్షియ‌ల్ మూవీపై ప్ర‌త్ఏక దృష్టిపెట్టిన రామ్‌కు `ఐకాన్` బెస్ట్ ఛాయిస్ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News